Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ను మళ్లించారు.

Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions

Hyderabad Traffic Restrictions : హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం (మార్చి28,2023) నుండి 2023జూలై 28 వరకు ముడూ నెలలపాటు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్‌లోని AG కాలనీ నుండి లక్ష్మీ కాంప్లెజ్ వరకు నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా, పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని పలు చోట్ల వద్ద హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. నాలా పునర్నిర్మాణ పనుల దృష్ట్యా ట్రాఫిక్ ను మళ్లించారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులు, ప్రయాణికులకు సూచించారు.

కూకట్‌పల్లి నుంచి అమీర్‌పేట్‌ వైపు వచ్చే ప్రయాణికులు కూకట్‌పల్లి మెట్రో స్టేషన్‌ వద్ద యూ టర్న్‌ – లెఫ్ట్‌ టర్న్‌ ఐడిఎల్‌ లేక్‌ రోడ్‌ – గ్రీన్‌ హిల్స్‌ రోడ్‌ – యు టర్న్‌ రెయిన్‌బో విస్టాస్‌ – లెఫ్ట్‌ టర్న్‌ ఖైత్లాపూర్‌ ఫ్లైఓవర్‌ – లెఫ్ట్‌ టర్న్‌ ఖైత్లాపూర్‌ ఫ్లైఓవర్‌ – పార్వత్‌నగర్‌ – టోడీ కాంపౌండ్‌ – ఎడమవైపు మళ్లింపు. కావూరి హిల్స్ – నీరూస్ జంక్షన్ – జూబ్లీ చెక్ పోస్ట్ – ఎడమ మలుపు – యూసుఫ్‌గూడ రోడ్డు – మైత్రివనం, అమీర్‌పేట్ వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

Traffic Restrictions : హైదరాబాద్ లోని ఈ మార్గంలో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

కూకట్‌పల్లి నుంచి బేగంపేట వైపు వచ్చే ప్రయాణికులు కూకట్‌పల్లి వై జంక్షన్ – బాలానగర్ ఫ్లైఓవర్ – న్యూ బోవెన్‌పల్లి జంక్షన్ రైట్ టర్న్ – తాడ్‌బండ్ రైట్ టర్న్ – ప్యారడైజ్ జంక్షన్ రైట్ టర్న్ – బేగంపేట ఫ్లైఓవర్ వద్ద మళ్లించాలని సూచించారు. బాలానగర్‌ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌ మీదుగా అమీర్‌పేట వైపు వచ్చే ప్రయాణికులు బాలానగర్‌ ఫ్లైఓవర్‌ కింది నుంచి న్యూ బోవెన్‌పల్లి జంక్షన్‌ – తాడ్‌బండ్‌ రైట్‌ టర్న్‌ – ప్యారడైజ్‌ జంక్షన్‌ రైట్‌ టర్న్‌ – బేగంపేట్‌ ఫ్లైఓవర్‌ రైట్‌ టర్న్‌ తీసుకుని అమీర్‌పేట్‌ రావాలని సూచించారు.

మూసాపేట్ మరియు గూడ్‌షెడ్ రోడ్డు నుండి అమీర్‌పేట వైపు వచ్చే ప్రయాణికులు ఐడిఎల్ లేక్ రోడ్ – గ్రీన్ హిల్స్ రోడ్ – యు టర్న్ – రెయిన్‌బో విస్టాస్ – లెఫ్ట్ టర్న్ ఖైత్లాపూర్ ఫ్లైఓవర్ – లెఫ్ట్ టర్న్ పార్వత్‌నగర్ – టోడీ కాంపౌండ్ – ఎడమవైపు కావూరి హిల్స్ – మీరస్ జంక్షన్ వైపు వెళ్లాలని సూచించారు. జూబ్లీ చెక్ పోస్ట్ – ఎడమ మలుపు – యూసుఫ్‌గూడ రోడ్డు – మైత్రివనం, అమీర్‌పేట వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.