Traffic Restrictions : హైదరాబాద్ లోని ఈ మార్గంలో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.

Traffic Restrictions : హైదరాబాద్ లోని ఈ మార్గంలో మూడు నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

Traffic restrictions

Traffic Restrictions : హైదరాబాద్ లో ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు మూడు నెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు కొనసాగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ఆ మార్గంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈ ట్రాఫిక్ ఆంక్షలు మార్చి 10 నుంచి జూన్ 10వ తేదీవరకు అమల్లో ఉంటాయని తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని ఉన్నతాధికారులు విజప్తి చేశారు.

చిక్కడపల్లి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ మీదుగా వెళ్లే వాహనాదారులు.. సుధా నందిని హోటల్ లేన్ వద్ద లెఫ్ట్ తీసుకొని సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్ట్రీట్ నెంబర్ 9 మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరాపార్కు చేరుకోవాలి. వీఎస్ టీ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మీదుగా అశోక్ నగర్ వెళ్లాలనుకునే వాహనాదారులు.. క్రాస్ రోడ్డులోని హేబ్రోన్ చర్చి లేన్, ఆంధ్రా కేఫ్, జగదాంబ హాస్పిటల్ మీదుగా అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు, ఇందిరా పార్కు చేరుకోవాలి.

Traffic Rules : మీ వాహనం ‘స్టాప్‌ లైన్‌’దాటిందా? అయితే తప్పదు భారీ జరిమానా.. ‘గీత’ దాటినందుకు ఒక్కరోజే 3,702 కేసులు నమోదు

ఇందిరా పార్కు నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు వచ్చే వాహనదారులు.. అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ నుంచి జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హేబ్రోన్ చర్చి, చిక్కడపల్లి మెయిన్ రోడ్డుకు చేరుకోవాలి. అశోక్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి స్ట్రీట్ నెంబర్ 9 మీదుగా సిటీ సెంట్రల్ లైబ్రరీ, సుధా నంది హోటల్ లేన్, చిక్కడపల్లి మెయిన్ రోడ్డు చేరుకోవాలి.