Rajagopal Reddy resign : రేపే ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా..ఈనెల 21న బీజేపీలో చేరిక!
మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రేపు రాజీనామా చేయనున్నారు. రేపు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి కలవనున్నారు. ఆయకు ఉదయం 10గంటల 30నిమిషాలకు స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజగోపాల్‌రెడ్డి రాజీనామా సమర్పించనున్నారు. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు.

Rajagopal Reddy join BJP
Rajagopal Reddy resign : మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రేపు రాజీనామా చేయనున్నారు. రేపు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని రాజగోపాల్‌రెడ్డి కలవనున్నారు. ఆయకు ఉదయం 10గంటల 30నిమిషాలకు స్పీకర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజగోపాల్‌రెడ్డి రాజీనామా సమర్పించనున్నారు. ఈనెల 21న అమిత్ షా సమక్షంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరనున్నారు.
ఆగస్టు 2న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హస్తానికి హ్యాండ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ లో ప్రకటించారు. మునుగోడు ప్రజల కోసమే తాను రాజీనామా చేశానని తెలిపారు. మునుగోడుకు తన రాజీనామా మేలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆత్మగౌరవం చంపుకొని పదవిలో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
TS Congress: రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. దూకుడు పెంచిన కాంగ్రెస్
ఎవరు గెలుస్తారో మునుగోడు ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. తన రాజీనామాతో ప్రభుత్వం దిగివస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. కుటుంబ పాలనపై తనకు పోరాటం అన్నారు. తన పోరాటం టీఆర్ఎస్ పైనే..కాంగ్రెస్ సరిగా పోరాటం చేయలేదు కాబట్టే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ తాను ఎప్పుడూ అన్యాయం చేయలేదన్నారు. సోనియాను తిట్టిన వ్యక్తిని అందలం ఎక్కించారని వాపోయారు. బయటి నుంచి వచ్చిన వారికింద పనిచేయాలా అన్నారు. కాంగ్రెస్ పై గౌరవం ఉన్నందునే ఇన్నాళ్లూ పార్టీలో ఉన్నానని తెలిపారు. బయటి నుంచి వచ్చిన వ్యక్తిని సీఎం చేయాలా అని నిలదీశారు.