Komatireddy Rajagopal Reddy: డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఓ దొంగ..బ్లాక్ మెయిలర్

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. పీసీసీ పదవిని డబ్బులు పెట్టి కొన్న రేవంత్ రెడ్డి ఓ దొంగ..ఓ బ్లాక్ మెయిలర్ అంటూ పలు ఆరోపణలు చేశారు.

Komatireddy Rajagopal Reddy: డబ్బులు పెట్టి పీసీసీ పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఓ దొంగ..బ్లాక్ మెయిలర్

Komatireddy Rajagopal Reddy:  కాంగ్రెస్ పార్టీలో ఉండేది లేదని స్పష్టం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో బుధవారం (3,2022) మాట్లాడుతూ..టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో టీడీపీ ఖతం చేసిన రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరారని..పీసీసీ పదవిని డబ్బులు పెట్టి కొన్న రేవంత్ రెడ్డి ఓ దొంగ..ఓ బ్లాక్ మెయిలర్ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. డబ్బుల కోసం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ లు చేస్తారనే విషయం తెలంగాణ ప్రజలకు తెలుసని..అటువంటి రేవంత్ రెడ్డి కింద తమలాంటి ఆత్మాభిమానం ఉన్న నేతలు పనిచేయలేని అన్నారు. తమకు వ్యాపారాలు ఉన్నాయి..కానీ రేవంత్ రెడ్డికి ఏం వ్యాపారాలు ఉన్నాయి? ఏ వ్యాపారం చేయకున్నా… రేవంత్ రెడ్డికి కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Rajagopal Reddy : తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టీ మరీ పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకున్నాడని.. అదే పదవిని అడ్డం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి దోచుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని బలి దేవత అని వ్యాఖ్యానించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ నిందను మరొకరిపై వేస్తున్నాడని అన్నారు. ఏ వ్యాపారం లేకుండా కేవలం రాజకీయాలపైనే బ్లాక్ మెయిల్ చేసి కోట్లకొద్ది ఆస్తులు సంపాదించాడనే విషయం తెలంగాణలో అందరికీ తెలుసు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

నాలుగు పార్టీలు మారి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇంకొకరు పార్టీ మారడం గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. తాను రేవంత్ రెడ్డి చేపట్టిన పిసిసి చీఫ్ పదవికి మద్దతు ఇవ్వలేదని.. అందుకే తనపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని రాజగోపాల్ మండిపడ్డారు. తాను వ్యాపారాలు చేసినా.. నిజాయితీగానే వ్యాపారం చేశానని.. అది తప్పెలా అవుతుందని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో తమ కుటుంబం కొనసాగుతోందని అని పార్టీలు మార్చే బుద్ధి తమకు లేదని..కానీ రేవంత్ రెడ్డి కింద పనిచేయలేమని..బ్లాక్ మెయిలింగులు చేసే వ్యక్తే తమను విమర్శిస్తున్నారని..తాను ఎప్పుడు కూడా సోనియా గాంధీని..రాహుల్ గాంధీపై ఒక్క విమర్శ కూడా చేయలేదనివారంటే తనకు గౌరవం ఉందని స్పష్టంచేశారు. ఇంత గౌరవం ఉన్నా తాను మాత్రం పార్టీలో ఉండే పరిస్థితి లేదని..అందుకే రాజీరామా చేశానని స్పష్టంచేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

TS Congress: రాజగోపాల్ రెడ్డి రాజీనామా.. దూకుడు పెంచిన కాంగ్రెస్

రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేయటానికి కాంగ్రెస్ నేతలంతా బాధపడుతున్నారని..అవమానంగా ఫీల్ అవుతున్నారని..ఎవ్వరు కూడా సంతోషంగా లేరని రాజగోపాల్ అన్నారు. ఓ దొంగ..బ్లాక్ మెయిలర్ అయిన రేవంత్ ఆధ్వర్యంలో పనిచేయలేమని..ఆత్మగౌరవం లేని చోట పనిచేయలేం అని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. తనపై కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొలపాలని రేవంత్ రెడ్డి యత్నిస్తున్నారని..కానీ కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పుడూ తనతోనే ఉంటారని రేవంత్ గురించి వారికి బాగా తెలుసని అన్నారు. రేవంత్ ఓ చిల్లర దొంగ అని అటువంటి చిల్లర దొంగవద్ద పని చేసే ప్రసక్తే లేదని అంటూ తీవ్రంగా మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి.

తన స్వార్థ ప్రయోజనాల కోసం, వ్యాపార అవసరాల కోసం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి ఇచ్చిన కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ మారుతున్నారు అంటూ రేవంత్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. నేను డబ్బుల కోసం పార్టీ మారటంలేదు..నేను బీజేపీలోకి కాంట్రాక్టుల కోసం వెళ్తున్నానని నిరూపిస్తావా? అంటూ సవాల్ విసిరారు. రూ.20వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లతున్నారని చేసిన ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..రూ.20వేల కోట్ల కాంట్రాక్ట్ నాకు వచ్చిందని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. నిరూపించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అంటూ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు.