Tragedy : గుండెపోటుతో సోదరుడు మృతి.. బోరున విలపిస్తూ ఆఖరిసారి మృతదేహానికి రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

ధూళికట్ట గ్రామానికి చెందిన కనకయ్యయాదవ్ గుండె పోటుతో చనిపోయాడు. అన్న మరణాన్ని తోబుట్టువులు తట్టుకోలేకపోయారు. ఆఖరిసారి అన్న మృతదేహానికి రాఖీ కట్టారు.

Tragedy : గుండెపోటుతో సోదరుడు మృతి.. బోరున విలపిస్తూ ఆఖరిసారి మృతదేహానికి రాఖీ కట్టిన అక్కాచెల్లెళ్లు

Tragedy in Peddapally

Tragedy In Peddapalli : అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అపురూప బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. కలిసి మెలిసి పెరుగుతారు. పెద్దైన తర్వాత ఆ బంధం కొనసాగిస్తారు. అక్కాచెళ్లెలుకు ఏ కష్టం వచ్చినా అన్నాతమ్ముడు అండగా ఉంటారు. ఏటా రాఖీ పండుగ వేళ తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటారు. ఎక్కడెక్కడో ఉన్న అక్కాచెల్లెళ్లంతా సోదరుల ఇంటికి వచ్చి రక్షా బంధన్ వేడుకల్లో పాల్గొంటారు.

ఆ విధంగానే సోదరుడితో కలిసి రాఖీ పండుగ జరుపుకోవాలని తోబుట్టువులు అనుకున్నారు. రక్షా బంధన్ పండుగ జరుపుకోవాలనుకున్న వారికి అనుకోని విషాదం ఎదురైంది. సోదరుడికి రాఖీ కడదామని కొండంత ఆశతో ఉన్న అక్కాచెల్లెళ్లకు తీవ్ర వేదన మిగిలింది.

Dogs Bit School Girl : తమిళనాడు హోసూర్‌లో దారుణం.. స్కూల్ విద్యార్థినిపై దాడి చేసి, కరిచి ఈడ్చుకెళ్లిన వీధి కుక్కలు

రాఖీ పండుగ వేళ సోదరుడు గుండె పోటుతో చనిపోయాడు. దీంతో అక్కాచెల్లెళ్లు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బోరున విలపిస్తుూ సోదరుడి మృతదేహానికి రాఖీ కట్టారు. ఈ హృదయ విధారక ఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టలో చోటు చేసుకుంది.

ధూళికట్ట గ్రామానికి చెందిన కనకయ్యయాదవ్ గుండె పోటుతో చనిపోయాడు. అన్న మరణాన్ని తోబుట్టువులు తట్టుకోలేకపోయారు. ఆఖరిసారి అన్న మృతదేహానికి రాఖీ కట్టారు. కనకయ్యయాదవ్, ఆయన తోబుట్టువుల అనుబంధం చూసి స్థానికులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ దృశ్యం అందరినీ కలిచి వేసింది.