Palla rajeshwar reddy : దమ్ముంటే ధాన్యం కొనిపించండి.. తెలంగాణ బీజేపీ నేతలపై పల్లా ఫైర్..

తెలంగాణ బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా మొరగడం మాని కేంద్రంతో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనిపించాలని, లేదంటే గాజులేసుకొని ఇంట్లో కూర్చోవాలని తెరాస నేత..

Palla rajeshwar reddy : దమ్ముంటే ధాన్యం కొనిపించండి.. తెలంగాణ బీజేపీ నేతలపై పల్లా ఫైర్..

Trs Ledar Palla

Palla rajeshwar reddy : తెలంగాణ బీజేపీ నేతలు పిచ్చి కుక్కల్లా మొరగడం మాని కేంద్రంతో తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనిపించాలని, లేదంటే గాజులేసుకొని ఇంట్లో కూర్చోవాలని తెరాస నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇందిరా పార్కు దగ్గర బండి సంజయ్ ఇష్టమొచ్చినట్లు మొరిగిండని, ధాన్యం కేంద్రం కొంటదని బండి సంజయ్ అంటుంటే, మాకు లెక్కలు ఇవ్వలేదు తీసుకోమని కేంద్రం అంటుందని విమర్శించారు. బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్, లేకపోతే కేంద్రానికి ఏ లెక్కలు ఇవ్వాలో బీజేపీ – FCI చెప్పాలని ప్రశ్నించారు. రైతులను యాసంగిలో వరి సాగు తగ్గించాలని మేము కోరితే.. తెలంగాణ బీజేపీ నేతలు వరి సాగు చేయండి కేంద్రం కొంటుందని రెచ్చగొట్టారని, ఇప్పుడు వడ్లు చేతికొచ్చే సమయంలో మొఖం చాటేశారని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

TRS Maha Dharna : ధాన్యం దంగల్, ఢిల్లీలో ఫ్లెక్సీల వార్

పీయూష్ గోయల్ రాష్ట్ర బీజేపీ నేతలను పిలుచుకొని ఇష్టమొచ్చినట్లు వాగొద్దని క్లాస్ పీకాడని, కానీ మోడీ – అమిత్ షా బూట్లునాకి మళ్లీ పిచ్చిమాటలు మొదలు పెట్టారని పల్లా పేర్కొన్నాడు. తెలంగాణ బీజేపీ నేతలకు వరికి, గోదుములకు తేడా తెలియడం లేదని పల్లా ఎద్దేవా చేశాడు. తెలంగాణ బీజేపీ నేతలు ఉత్తర భారతదేశ నాయకులకు కాళ్లావేళ్లా పడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ నువ్వు చస్తే రైతు బీమాతో రూ. 5లక్షలు తెరాస ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ పాలిక ప్రాంతాల్లో ఎక్కడైనా అమలవుతున్నాయా అంటూ ప్రశ్నించారు. బీజేపీ పాలిక ప్రాంతాల్లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువ అన్నారు.

TRS Maha Dharna : ధాన్యం దంగల్, ఢిల్లీలో ఫ్లెక్సీల వార్

బీజేపీ నేతలు ఒక్క మాట అంటే ముమే పదిమాటలు అంటామని పల్లా అన్నారు. నేను నిన్ను తిడితే నాపై దాడి చేస్తావ్ కావొచ్చు అన్నింటినికి నేను సిద్ధం. బెదిరించేందుకు ఐటి, ఈడి దాడులు చేస్తారు కావొచ్చు.. నేను బయపడా.. ఇన్ని రోజులు ఓపిక పట్టాం, ఇక ప్రజలు, రైతులు మిమ్మల్ని ఉరికించి కొట్టడం ఖాయమంటూ పల్లా తెలంగాణ బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.