TRS Maha Dharna : ధాన్యం దంగల్, ఢిల్లీలో ఫ్లెక్సీల వార్

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. తెలంగాణ భవన్ పక్కనే బండి సంజయ్ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి.

TRS Maha Dharna : ధాన్యం దంగల్, ఢిల్లీలో ఫ్లెక్సీల వార్

Trs And Bjp

TRS And BJP Flexi War : ఢిల్లీలో ధాన్యం దంగలే కాదు..ఫ్లెక్సీల యుద్ధమూ మొదలయింది. టీఆర్‌ఎస్ నిరసనకు దీటుగా బదులిచ్చేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. టీఆర్‌ఎస్ కటౌట్లకు పోటీగా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే బీజేపీ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు చించివేస్తున్నారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కేసీఆర్‌కు వ్యతిరేకంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది బీజేపీ. తెలంగాణ భవన్ పక్కనే బండి సంజయ్ బీజేపీ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను వదిలేసి ఢిల్లీలో డ్రామాలాడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.

Read More : Paddy Issue : ఢిల్లీలో టీఆర్ఎస్ ధాన్యం దంగల్.. కేంద్రం దిగొస్తుందా ?

అయితే.. దీనిని గమనించిన టీఆర్ఎస్ నేతలు వాటిని తొలగించి వేశారు. వడ్లు కొనిపిస్తామని చెప్పి హైదరాబాద్ లో ఎందుకు ధర్నా చేస్తారని ప్రశ్నించారు. గతంలో కూడా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రైతాంగాన్ని రెచ్చగొట్టకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రయత్నించవద్దని సూచించారు. మరోవైపు…టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధుల నిరసన దీక్షకు వెలిసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్లకార్డులు, జెండాలతో తెలంగాణ భవన్‌, ఢిల్లీ రోడ్లు గులాబీమయమయ్యాయి. బరి గీసి కొట్లాడుతాం, గిరి గీసి ప్రశ్నిస్తాం, మా వడ్లు కొంటవా..? కొనవా..తెలంగాణ రైతుల తెగువ చూపిస్తాం..నూకలు తినమన్నోళ్ల తోక కత్తిరిస్తాము అంటూ ఉన్న పోస్టర్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Read More : TRS Delhi Dharna : మా దీక్షను చిన్న చూపు చూస్తే కేంద్రానికే నష్టం-నిరంజన్ రెడ్డి

తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…ఢిల్లీ వేదికగా పోరు ఉధృతం చేస్తోంది. ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేయనున్నారు టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరగనున్న ఈ దీక్షలో రాష్ట్ర మంత్రులు, టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, రైతు సంఘాల నేతలు, ప్రతినిధులు…మొత్తం మూడు వేల మందికి పైగా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు నిరసన దీక్ష మొదలుకానుంది. 10 గంటల 45 నిమిషాలకు సీఎం కేసీఆర్‌ దీక్షా వేదికకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం వరకు ఈ దీక్ష కొనసాగనుంది.

Read More : Paddy Issue : ధాన్యం దంగల్.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష

ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రం వైఖరిని నిరసిస్తున్న టీఆర్‌ఎస్‌.. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పంటల సేకరణ విధానం ఉండాలని డిమాండ్ చేస్తోంది. కొన్ని నెలలుగా టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య ధాన్యం సేకరణ అంశంలో మాటల యుద్ధం జరుగుతోంది. ధాన్యం సేకరణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ సర్కార్‌ అంటుంటే..ధాన్యం కాదు బియ్యం తీసుకుంటామంటోంది కేంద్రం. ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కమలనాథులు డిమాండ్‌ చేస్తున్నారు. జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేసిన సీఎం కేసీఆర్…యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీ వేదిక దీక్షకు దిగుతుండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కానుంది.