Paddy Issue : ధాన్యం దంగల్.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష కోసం...

Paddy Issue : ధాన్యం దంగల్.. ఢిల్లీలో సీఎం కేసీఆర్ నిరసన దీక్ష

Cm Kcr Delhi Tour

Paddy Procurement : దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా 2022, ఏప్రిల్ 11వ తేదీ సోమవారం ఈ దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష కోసం తెలంగాణ భవన్ లో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిరసనలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. దీక్షా స్థలిని ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పరిశీలించారు. దాదాపు మూడు వేల మంది నిరసన దీక్షలో పాల్గొననున్నారని తెలుస్తోంది.

Read More : Kalvakuntla Kavitha: కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ముప్పు: ఎమ్మెల్సీ కవిత

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకుల కోసం తెలంగాణ భవన్‌తో పాటు చుట్టుపక్కల హోటళ్లలో వసతి ఏర్పాట్లు చేశారు. దీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వర్‌రావు, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, గోపీనాథ్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌ తదితరులు దీక్షా వేదిక ఏర్పాటు పనులను పరిశీలించారు. దీక్షలో పాల్గొనేవారికి ఏ ఇబ్బందీ రాకుండా చర్యలు తీసుకొంటున్నారు నేతలు. వేదిక, పార్కింగ్‌, భోజనం, విమానాశ్రయం నుంచి దీక్షా స్థలికి చేరుకొనేందుకు వాహనాల ఏర్పాటుతో పాటు తదితర పనులకు ఉప కమిటీలు నియమించారు.

Read More : Ram Navami 2022 : రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఇవాళ సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు. తెలంగాణ నుంచి ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ధాన్యాన్ని సేకరించేదాకా కేంద్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.