Ram Navami 2022 : రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.

Cm Kcr Srirama Navami
Ram Navami 2022 : శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు. భద్రాచలంలో సీతారాముల కల్యాణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు.
ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు అని సీఎం కొనియాడారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైందని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం పేర్కొన్నారు.
Also Read : Ram Navami 2022 : కన్నుల పండువగా జరిగిన రాములోరి ఎదుర్కోలు ఉత్సవం
సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని సీతారామచంద్రులను సీఎం కేసీఆర్ ప్రార్థించారు.