Ram Navami 2022 : కన్నుల పండువగా జరిగిన రాములోరి ఎదుర్కోలు ఉత్సవం

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం సీతారామచంద్రస్వామి వార్ల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో కన్నుల

Ram Navami 2022 : కన్నుల పండువగా జరిగిన రాములోరి ఎదుర్కోలు ఉత్సవం

Sri Rama Navami

Ram Navami 2022 :  భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కల్యాణ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం సీతారామచంద్రస్వామి వార్ల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో కన్నుల పండువగా జరిగింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.

అంతకు ముందు స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపు మధ్యాహ్నం సీతారామచంద్ర స్వామి కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

భద్రాచలం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్ ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది రెండున్నర లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

Also Read : Ram Navami 2022 : సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

స్టేడియం బయట నిల్చుని కల్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామాలయ పరిసర ప్రాంతాలలో వసతి కేంద్రాలను, తాగునీటి సౌకర్యం కల్పించారు. గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియం చుట్టు పక్కల గ్యాలరీలో ప్రత్యేకంగా ఈసారి కూలర్లు ఏర్పాటు చేశారు.