Rahul Gandhi : టిఫిన్ బండి వద్ద దోసెలు వేసిన రాహుల్ గాంధీ .. జగిత్యాల పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు

జగిత్యాల పర్యటనలో రాహుల్ గాంధీ టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోసెలు వేశారు. చిన్నారులకు చాక్లెట్లు పంచారు. ఇలా తనదైన శైలిలో రాహల్ ఆసక్తికర దృశ్యాలతో ఆకట్టుకుంటున్నారు.

Rahul Gandhi : టిఫిన్ బండి వద్ద దోసెలు వేసిన రాహుల్ గాంధీ .. జగిత్యాల పర్యటనలో ఆసక్తికర దృశ్యాలు

Rahul Gandhi cooking dosa

Rahul gandhi cooking dosa : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత రెండు రోజులుగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు రాహుల్ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా జగిత్యాలకు వెళుతూ మార్గ మధ్యలో NAC స్టాప్ వద్ద ఆగారు. ఈ సందర్భంగా రాహుల్ నూకపల్లిలో స్కూటీపై వెళుతున్న ప్రయాణికులతో ముచ్చటించారు. చిన్నారులకు చాక్లెట్స్ అందించారు.

అలాగే అక్కడే ఉన్న ఓ టిఫిన్ బండి వద్దకు వెళ్లి సరదాగా దోసెలు వేశారు. రాహుల్ గాంధీ దోసెలు వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దోసెలు వేసిన రాహుల్ దోసెల బండి ఓనర్ కు తినిపించారు. రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం ప్రభాకర్,కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి తదితర నేతలు ఉన్నారు. రాహుల్ గాంధీ చిన్నారులకు చాక్లెట్లు పంచిన ఫోటోలను..దోసెలు వేసిన ఫోటోలను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ లో పోస్టు చేస్తు ..మనలో ఒక్కడు..మనందరి కోసం ఒక్కడు..అతడే మన రాహుల్ గాంధీ అంటూ పేర్కొంది.

కాగా తెలంగాణలో రాహుల్ పర్యటన పొలిటికల్ హీట్ ను పెంచింది. బీఆర్ఎస్ ఘాటు విమర్శలతో రాహుల్ విరుచుకుపడుతున్నారు. రాహుల్ విమర్శలకు బీఆర్ఎస్ అగ్రనేతలు కూడా తగినట్లుగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఇలా తెలంగాణ ఎన్నికల వేళ ట్విట్ట్ వేదికగాను సభలు, సమావేశాల వేదికగాను మాటల తూటాలు పేలుతున్నాయి.

రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేస్తే..తెలంగాణలో దొరలపాలన సాగుతోంది అంటూ రాహుల్ గాంధీ కూడా తనదైన శైలిలో కౌంటర్లిస్తున్నారు. ఈరోజు జగిత్యాల సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మరోసారి బీఆర్ఎస్ పాలనై విమర్శలు సంధించారు. అదే సమయంలో తెలంగాణ ప్రజలకు హామీలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే ఆరు గ్యాంరెంటీలు అంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ తెలంగాణలోని షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తాం అంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని చెరుకు, పసుపు రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. వరి ధాన్యానికి అదనంగా రూ.500లు మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చారు.