Cool summer: ఏసీ, కూలర్ లేకుండానే వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా..? అయితే ఇలా చేయండి..

వేసవి కావడంతో ఎండల మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు.

Cool summer: ఏసీ, కూలర్ లేకుండానే వేసవిలో మీ ఇల్లు చల్లగా ఉండాలా..? అయితే ఇలా చేయండి..

Vetiver Mats

Cool summer: వేసవి కావడంతో ఎండల మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దీనికితోడు వేడి గాలులు, ఉక్కపోత కూడా తోడుకావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మే 25 నుంచి రోహిణి కార్తె రానుంది. దీంతో ఎండల తీవ్రత ఇంకా పెరగే అవకాశాలు ఉన్నాయి.

Cooler Facts: వేసవి తాపం చల్లార్చే కూలర్లలో ఇవి తప్పక ఉండాల్సిందే

ప్రస్తుతం ఎండల తీవ్రతను తట్టుకొనేందుకు అధిక శాతం మంది ఇళ్లలో ఏసీ,4 కూలర్లను ఏర్పాటు చేసుకొని సేదతీరుతున్నారు. వాటిని కొనుగోలు చేయలేనివారు ఉక్కపోతతో ఇంట్లోనే ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది తమ ఇంటి స్లాబ్ లపై వైట్ పెయింట్ వేస్తూ స్వల్ప ఉపశమనాన్ని పొందుతున్నారు. వేసవి కావడంతో విద్యుత్ కోతలు సర్వసాధారణం. దీంతో ఇండ్లలో ఏసీలు, కూలర్లు కూడా పనిచేయని పరిస్థితి. కరెంట్ తో పనిలేకుండా, తక్కువ ఖర్చుతో మీరు ఉండే ఇల్లు చల్లగా ఉండాలంటే కొద్దిపాటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మార్కెట్లో, సూపర్ బజార్లలో వట్టివేళ్ల చాపలు దొరుకుతాయి.

Cooling In Summer : వేసవిలో శరీరానికి చల్లదనం కోసం.. రాగి,బాదం మిల్క్ షేక్!

వీటిని కొనుగోలు చేసి మన ఇంటిలోని కిటికీలకు బయట వైపు అమర్చుకోవాలి. ఇంట్లోకి గాలివచ్చే ప్రధాన కిటికీకి దీనిని ఏర్పాటు చేసుకొని దీనిని నీటితో తడపాలి. ఈ క్రమంలో బయట నుంచి వచ్చే ఎంతటి వేడి గాలి అయిన వట్టివేళ్ల చాపనుంచి వచ్చే క్రమంలో చల్లగా మారిపోతుంది. దీనికితోడు వట్టివేళ్ల నుంచి వచ్చే సువాసన ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల స్వచ్ఛమైన గాలిని మనం పీల్చే అవకాశం కూడా ఉంటుంది. వీటిని గతంలో పల్లె ప్రాంతాల్లో ఎక్కువగా వినియోగించేవారు. ప్రస్తుతం కూలర్లు అధికంగా రావడంతో వీటి వినియోగం తగ్గిపోయింది.