Cooling In Summer : వేసవిలో శరీరానికి చల్లదనం కోసం.. రాగి,బాదం మిల్క్ షేక్!

వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లబరిచేందుకు రాగులు ఎంతగానో ఉపయోగపడుతాయి. మధుమేహం, కాన్సర్, ఎముకలు గుల్లబారడం, వంటి ఎన్నో వ్యాధులను అరికట్టటంలో అద్భుతంగా రాగులు పనిచేస్తాయి.

Cooling In Summer : వేసవిలో శరీరానికి చల్లదనం కోసం.. రాగి,బాదం మిల్క్ షేక్!

Ragi,badam Milk

Cooling In Summer : కాల్షియం అధికంగా ఉండే చిరుధాన్యాల్లో రాగులు ఒకటి. వేసవి కాలంలో మన శరీరాన్ని చల్లబరిచేందుకు రాగులు ఎంతగానో ఉపయోగపడుతాయి. మధుమేహం, కాన్సర్, ఎముకలు గుల్లబారడం, వంటి ఎన్నో వ్యాధులను అరికట్టటంలో అద్భుతంగా రాగులు పనిచేస్తాయి. ఈ చిరుధాన్యాలతో రుచికరమైన రాగి లడ్డూలు, బిస్కెట్లు, పకోడీల లాంటి వంటకాలను తయారు చేసుకోవచ్చు. దీనిలో ఫాస్ఫరస్, పొటాషియం , ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. హిమోగ్లోబిన్ తక్కువ స్థాయిలో ఉండే ప్రమాదం ఉన్నవాళ్ళకి రాగులు ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. అదే విధంగా బాదంలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ప్రొటీన్లు, ఖానిజాలు, విటమిన్లు, ఫైబర్లు సమృద్ధిగా ఉంటాయి. బాదం కొలెస్ట్రాల్ స్ధాయిల్ని తగ్గిస్తుంది. హృదయ సంబంధ సమస్యలు, కాన్సర్ నివారణలో సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులకు ఎంతగానో మేలు చేస్తుంది.

వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ కారణంగా నీరసం వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. వేసవి నుండి శరీరాన్ని చల్లబరిచేందుకు రాగి, బాదం రెండు కలగలిపి మిల్క్ షేక్ గా చేసుకుని సేవిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రుచికరమైన రాగి , బాదం మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం…

రాగి,బాదం మిల్క్ షేక్ తయారీ ;

ముందుగా 100గ్రాముల రాగులు ఒక కప్పులో తీసుకోవాలి. అదే విధంగా 15 బాదం గింజలు, బెల్లం పొడి రెండు స్పూన్లు, యాలుకుల పొడి పావు స్పూను, నీళ్ళు ఒక కప్పు తీసుకోవాలి. రాగులను శుభ్రం చేసి నీళ్ళతో బాగా కడగాలి. తరువాత రాగులు మునిగే వరకు నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. బాదం గింజలనూ నానబెట్టుకోవాలి. ఉదయం బాదం పొట్టుతీసి కొన్ని నీళ్ళు పోసి మిక్సీలో వేసి పేస్టుగా చేసుకోవాలి. అలాగే రాగులను మిక్సీలో వేసి తగినన్ని నీరు పోసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పలుచనైన వస్త్రంలో వేసి రాగిపాలను పిండుకోవాలి.

అనంతరం పొయ్యి పై గిన్నె ఉంచి కొన్ని నీళ్ళను పోయాలి. బెల్లం వేసి కరిగిన తర్వాత పొయ్యి కట్టేయాలి. ఇందులోనే రాగిపాలు, బాదం పేస్ట్, యాలుకుల పొడి వేసి బాగా కలపాలి. అవసరమైతే అలంకరణకోసం నాలుగు బాదం గింజలను చిన్నచిన్న ముక్కలుగా కోసి తయారు చేసుకున్న రాగి బాదం షేక్ పై అలంకరించుకోవాలి. వేసవిలో శరీరాన్ని చల్లబరిచేందుకు ఈ రాగి , బాదం మిల్క్ షేక్ ఎంతగానో దోహదపడుతుంది. ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మంచిది.