Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేశారు.

Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు

Telangana Govt

Updated On : December 29, 2025 / 11:43 PM IST

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పునర్ వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీతో పాటు పోలీసు కమిషనరేట్లను పునర్‌వ్యవస్థీకరించింది. గతంలో ఉన్న మూడు కమిషనరేట్లను పునర్ వ్యవస్థీకరిస్తూ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది. మరోవైపు పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read : Telangana : తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై కీలక అప్‌డేట్.. నోటిఫికేషన్ వచ్చేసింది..

ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు, మల్కాజిగిరి సీపీగా అవినాశ్ మహంతి, సైబరాబాద్ సీపీగా రమేశ్ రెడ్డిలను ప్రభుత్వం నియమించింది. అదేవిధంగా యాదాద్రి ఎస్పీగా ఆకాంక్ష యాదవ్ ను నియామకం చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

రాచకొండ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించి మల్కాజ్‌గిరి పేరుతో కొత్త కమిషనరేట్‌ను ఏర్పాటు చేశారు. కీసర, శామీర్ పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు ఈ కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్‌గా ఏర్పాటు చేసి.. యాదాద్రి భువనగిరి జిల్లాకు ఎస్పీని ప్రభుత్వం నియమించింది.

కమిషనరేట్‌ల పరిధులు..
హైదరాబాద్ కమిషనరేట్ : అసెంబ్లీ, సెక్రటేరియట్, బేగంపేట, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, బుద్వేల్ హైకోర్టు వంటి కీలక ప్రాంతాలు.
సైబరాబాద్ కమిషనరేట్ : గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గ్, పఠాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, RC పురం, అమీన్‌పూర్ వంటి ఐటీ మరియు పారిశ్రామిక ప్రాంతాలు.
మల్కాజిగిరి కమిషనరేట్ : కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు.
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ : చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాలు.