Telangana High court New Judges : తెలంగాణ హైకోర్టులో ఆరుగురు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం
తెలంగాణ హైకోర్టులో కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో మంగళవారం(ఆగస్టు16,2022) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్ న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.

Telangana High new judges
Telangana High court New Judges : తెలంగాణ హైకోర్టులో ఆరుగురు కొత్త జడ్జీలు ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులోని మొదటి కోర్టు హాల్లో మంగళవారం(ఆగస్టు16,2022) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు ఉన్నారు.
ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్ న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు. న్యాయవాదుల కోటాలో ఆరుగురు న్యాయమూర్తులు హైకోర్టుకు నియామించిన విషయం తెలిసిందే.
Telangana High Court Jobs : తెలంగాణ హైకోర్టులో ఉద్యోగ ఖాళీల భర్తీ
ఇప్పటిదాకా హైకోర్టులో 28 మంది న్యాయమూర్తులు ఉండగా.. కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులతో కలిపి మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. హైకోర్టు ఏర్పాటు అయినప్పుడు జడ్జీల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హైకోర్టుకు కొత్తగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేశారు. మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.