TRS Plenary : పార్టీ పుట్టిన రోజు.. 21 ఏళ్ల సంబరాలు, కేటీఆర్ సమీక్ష

సభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జరగాల్సిన పనులపై చర్చించనున్నారు. అటు.. పార్టీ పుట్టిన రోజును హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు...

TRS Plenary : పార్టీ పుట్టిన రోజు.. 21 ఏళ్ల సంబరాలు, కేటీఆర్ సమీక్ష

Trs

Updated On : April 18, 2022 / 2:08 PM IST

TRS Plenary Minister KTR Review : ప్లీనరీకి టీఆర్ఎస్‌ పార్టీ రెడీ అవుతోంది. 21 ఏళ్ల సంబరాలను జరపుకునేందుకు గులాబీ పార్టీ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని HICCలో ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా 2022, ఏప్రిల్ 18వ తేదీ సోమవారం మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలు హాజరయ్యారు. సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లు..తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి కేటీఆర్ ఆదివారం పరిశీలించారు. సభాస్థలంలో ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

Read More : TRS Plenary Live Updates: టీఆర్ఎస్ ప్లీనరీ.. హైటెక్స్‌లో సందడి…!

గ్యాలరీ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నామని తెలిపారు కేటీఆర్‌. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ప్లీనరీ సన్నాహక కార్యాక్రమాలపై.. టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. ప్లీనరీ ఏర్పాట్లు, నిర్వహణపై.. జీహెచ్‌ఎంసీ పరిధిలోని టీఆర్ఎస్ నాయకులతో భేటీ అవుతున్నారు. సభలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. జరగాల్సిన పనులపై చర్చించనున్నారు. అటు.. పార్టీ పుట్టిన రోజును హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా.. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఈ నెల 27న హెచ్ఐసీసీలో టీఆర్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది. రాష్ట్ర మంత్రి వర్గం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతోపాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు వేడుకల్లో పాల్గొననున్నారు. 27న ఉదయం 11గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్.