Nallamothu Sridhar : డేటా చోరీ అంటే ఏమిటి? ఏ విధంగా తస్కరిస్తారు? పర్సనల్ డేటాను కాపాడుకోవడం ఎలా?

వ్యక్తిగత వివరాలను వేరే వాళ్లు ఏ విధంగా చోరీ చేస్తారు? ఆ డేటాతో ఏం చేస్తారు? అసలు డేటా చోరీ అంటే ఏమిటి?(Nallamothu Sridhar)

Nallamothu Sridhar : డేటా చోరీ అంటే ఏమిటి? ఏ విధంగా తస్కరిస్తారు? పర్సనల్ డేటాను కాపాడుకోవడం ఎలా?

Nallamothu Sridhar : డేటా చోరీ.. దీని గురించి తరుచుగా వింటున్నాం. క్రెడిట్ కార్డ్స్, సోషల్ మీడియా.. ఇలా పలు అంశాలకు సంబంధించి మనం మన వ్యక్తిగత వివరాలను ఇస్తుంటాం. ఆ వ్యక్తిగత వివరాలను వేరే వాళ్లు ఏ విధంగా చోరీ చేస్తారు? ఆ డేటాతో ఏం చేస్తారు? అసలు డేటా చోరీ అంటే ఏమిటి? దీనిపై ఐటీ రంగ నిపుణులు నల్లమోతు శ్రీధర్ ఏమన్నారంటే..

డేటా చోరీ అంటే..
వాస్తవానికి డేటా మైనింగ్ అనేది చాలా కాలంగా జరుగుతోంది. డేటా మైనింగ్ అనేది డేటా చోరీగా మారిపోతోంది. వేరే పర్పస్ కోసం మన నుంచి సమాచారం సేకరిస్తారు. ఆన్ లైన్ ఫామ్స్ కావొచ్చు, ఆఫ్ లైన్ ఫామ్స్ కావొచ్చు.. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ దగ్గరి నుంచి, అడ్రస్, ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీ, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు నెంబర్లు.. ఇలా ప్రతి డేటాను సేకరిస్తారు.(Nallamothu Sridhar)

బ్యాంకుకి వెళ్లినప్పుడు ఓ ఫామ్ ఇచ్చి మీ డిటైల్స్ సబ్మిట్ చేయండి అని చెప్పినప్పుడు.. మనకు బ్యాంకింగ్ సేవలు కావాలి కాబట్టి రెండో ఆలోచన లేకుండా ఆ వివరాలన్నీ సబ్మిట్ చేస్తాం. అలాగే డెబిట్ లేదా క్రెడిట్ కార్డు అప్లయ్ చేసినప్పుడు మన వ్యక్తిగత వివరాలు ఇస్తుంటాం. కొంతమంది బ్యాంకు ఉద్యోగులు.. కస్టమర్లకు ఫోన్ చేస్తారు. మీ డెబిట్, క్రెడిట్ కార్డు ఎక్స్ పైరీ డేట్ దగ్గర పడింది. కొత్త కార్డు తీసుకోవాలని చెబుతారు. వెంటనే అప్లయ్ చేయాలని చెబుతారు.

రకరకాల పద్దతుల్లో అంటే వారి నెట్ వర్క్స్ లో చొరబడటం లేదా వాళ్ల డేటా సేకరించి.. ఇలా ప్రతి ఒక్కరి డేటాను సేకరించడం అమ్ముకోవడం చేస్తుంటారు. అనేక మార్గాల్లో వ్యక్తుల పర్సనల్ డేటా థర్డ్ పార్టీస్ కు అందుతుంది.

Also Read..Hyderabad : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు అరెస్ట్

డేటా చోరీని అడ్డుకోవడం ఎలా?
డేటా చోరీని అడ్డుకోవడానికి పటిష్టమైన వ్యవస్థ ఏదీ లేదు. ఏదో ఒక సంస్థ మీకు సేవలు ఇస్తున్నాం కనుక.. మీ డేటా కలెక్ట్ చేస్తుంది. ఎలాంటి డేటాను సేకరించాలి? దాన్ని ఎలా సెక్యూర్ చేయాలి? అనేది దానిపై ఎలాంటి గైడ్ లైన్స్ లేవు. అందువల్ల మనం ఇచ్చే డేటాకు రక్షణ లేకుండా పోయింది. అలాగే మనం కూడా తెలిసో తెలియకో డేటా ఇచ్చేస్తున్నాం. కచ్చితంగా ప్రైవసీ చట్టాలు వస్తే మాత్రమే డేటాకు రక్షణ లభిస్తుంది.(Nallamothu Sridhar)

అది ఎలాంటి డేటా అయినా కావొచ్చు. ఫైనాన్షియల్ డేటా కావొచ్చు, సోషల్ మీడియా డేటా కావొచ్చు. యూజర్స్ యొక్క ప్రతి సమాచారం సోషల్ మీడియా ద్వారా అవైలబుల్ అవుతోంది. ప్రతీది కూడా ఆన్ లైన్ లోకి వెళ్లిపోతోంది. యూజర్ల అవగాహనారాహిత్యం కొంత, సంస్థల్లో పని చేసే ఉద్యోగుల చేతివాటం, డబ్బుకు కక్కుర్తి పడటం కొంతవరకు, ఆన్ లైన్ లో సబ్మిట్ చేసిన డేటా, వైరస్, మాల్ వేర్ కారణంగా కొంత డేటా మనకు తెలియకుండానే వెళ్లిపోతోంది. డేటా చోరీ కాకుండా కాపాడుకోవడం అంత సులువు కాదు.

Also Read..Nallamothu Sridhar : ఈడీ చేతిలో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు.. ఆ ఫోన్లలోని డేటాను ఎలా సేకరిస్తారు? డిలీట్ చేసిన డేటాని తిరిగి తీసుకోవచ్చా?

అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయొద్దు, అభ్యంతరకర వెబ్ సైట్ల జోలికెళ్లొద్దు..
యూజర్లు.. ఏ సైట్ ను పడితే ఆ సైట్ ను లేదా లింక్స్ ను క్లిక్ చేయకూడదు. ఇది కూడా డేటా చోరీకి కారణం అవుతుంది. ఇలాంటి బేసిక్ అంశాలపై మనం జాగ్రత్త పడితే కనుక.. ఏదైనా మెయిల్ వచ్చినా, మేసేజ్ వచ్చినా, లింక్ వచ్చినా జాగ్రత్తగా వ్యవహరించాలి. అభ్యంతరకమైన సైట్లలో కచ్చితంగా మాల్ వేర్, ట్రోజన్స్ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఈ అంశాల్లో జాగ్రత్తగా ఉంటే.. చాలావరకు సైబర్ క్రైమ్స్, డేటా చోరీలు జరగడానికి అవకాశాలు ఉండవు.