Hyderabad : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు అరెస్ట్

హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు.

Hyderabad : దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటా చోరీ.. ఆరుగురు అరెస్ట్

Gang arrested

Hyderabad : హైదరాబాద్ లో వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది వ్యక్తిగత డేటాను ఈ ముఠా చోరీ చేశారు. ఆధార్, పాన్ కార్డు, బ్యాంక్ వివరాలు కొట్టేసి సైబర్ నేరగాళ్లకు విక్రయిస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులను కొట్టేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఇక కోట్లాది మంది వ్యక్తిగత డేటాను పోలీసులు రీకవరీ చేశారు.

వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ ఆరుగురిని అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కోట్ల మంది డేటాను అంతరాష్ట్ర ముఠా చోరీ చేసిందని వెల్లడించారు. ఇన్సూరెన్స్, లోన్స్ కోసం అప్లై చేసిన 4 లక్షల మంది డేటా, 7 లక్షల ఫేస్ బుక్ యూజర్స్ డేటా చోరీ చేశారని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగుల డేటాను కూడా చోరీ చేశారని చెప్పారు. 16.8 కోట్ల మంది దేశ పౌరుల డేటా చోరీకి గురైందని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు.

Drug Supply Gang Arrest : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

ఢిఫెన్స్, ఆర్మీ ఉద్యోగులకు చెందిన సెన్సిటివ్ డేటాను కూడా అమ్మకానికి పెట్టారని సైబరాబాద్ సీపీ తెలిపారు. మహిళలకు చెందిన వ్యక్తిగత వివరాలు సైతం చోరీ చేశారని పేర్కొన్నారు. ఈ డేటా అంతా సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నారని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ కోసం ఒక ఏజెన్సీని పెట్టుకున్నామని తెలిపినట్లు వెల్లడించారు.

ఆ ఏజెన్సీ ఉద్యోగి డేటాను అమ్ముకున్నాడని పేర్కొన్నారు. వీరి వెనుక ఎవరెవరు ఉన్నారన్నదానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. జస్ట్ డయల్ మీద కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారిస్తామని పేర్కొన్నారు.