Drug Supply Gang Arrest : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముంబైకి చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

Drug Supply Gang Arrest : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

CV ANAND

Updated On : February 14, 2023 / 4:25 PM IST

drug supply gang arrest : హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. ముంబైకి చెందిన నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 204 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ ను స్వాధీన పరుచుకున్నారు. ముంబై పోలీసులతో కలిసి హైదరాబాద్ ఈస్ట్ జోన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. 110 కిలోల గంజాయితోపాటు నగుదు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ మేరకు నగర కమిషనర్ సీవీ ఆనంద్ వివరాలను వెల్లడించారు. కొండాపూర్ లో ఉంటున్న అనే విద్యార్థిని ఐటీ కంపెనీలో పని చేస్తోంది. అందిన సమాచారం ప్రకారం.. ఆమెను పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆమె దాదాపు 2 నుంచి 3 ఏళ్ల నుంచి ముంబైకి వెళ్లి రావడం. అక్కడ సనాఖాన్ జతిన్ అనే వ్యక్తి నుంచి గ్రాము డ్రగ్ 3 వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసినట్లు తెలిపారు.