Nallamothu Sridhar : ఈడీ చేతిలో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు.. ఆ ఫోన్లలోని డేటాను ఎలా సేకరిస్తారు? డిలీట్ చేసిన డేటాని తిరిగి తీసుకోవచ్చా?

ఫోన్ లో డిలీట్ అయిన డేటాను అధికారులు తిరిగి రిట్రీవ్ చేసే అవకాశం ఉందా? అసలు ఆ డేటాను తిరిగి పొందొచ్చా? (Nallamothu Sridhar)

Nallamothu Sridhar : ఈడీ చేతిలో ఎమ్మెల్సీ కవిత ఫోన్లు.. ఆ ఫోన్లలోని డేటాను ఎలా సేకరిస్తారు? డిలీట్ చేసిన డేటాని తిరిగి తీసుకోవచ్చా?

Nallamothu Sridhar : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫోన్లలోని డేటాను విశ్లేషించే పనిలో పడ్డారు ఈడీ అధికారులు. మంగళవారం ఉదయం తన 10 ఫోన్లను ఈడీ అధికారులకు అప్పగించారు కవిత. ఆ ఫోన్లను ఐటీ నిపుణులకు అప్పగించారు ఈడీ అధికారులు. ఐటీ నిపుణులు ఫోన్లలోని డేటాను రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

జీవోఎం ఆమోదించని లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ కాపీ, నిందితులతో జరిపిన చాట్స్, ఫోన్లలో డిలీట్ అయిన డేటాకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు ఈడీ అధికారులు. కవిత.. 2021లో 3 ఫోన్లు, 2022లో 7 ఫోన్లు మార్చారు. లిక్కర్ స్కామ్ లో 36 మంది నిందితులు మొత్తం 170 ఫోన్లను మార్చినట్లు ఈడీ ఆరోపిస్తోంది. 17 ఫోన్లలో ఉన్న డేటాను ఇప్పటికే సేకరించింది ఈడీ. లిక్కర్ స్కామ్ నిందితులు కోటి 30లక్షల రూపాయల విలువైన ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ ఆరోపిస్తోంది. 2022 మే నుంచి ఆగస్టు మధ్య నిందితులు అధికంగా ఫోన్లను మార్చారని ఈడీ చెబుతోంది.(Nallamothu Sridhar)

Also Read..Tech Tips in Telugu : మీ ఫోన్ నెంబర్‌కు స్పామ్ కాల్స్ వస్తున్నాయా? బ్లాక్ చేయాలంటే వెంటనే ఇలా చేయండి.. అన్ని నెట్‌వర్క్‌లకు ఒకటే ఆప్షన్..!

ఈడీ అధికారులు.. నిందితుల నుంచి ఫోన్లను అయితే సేకరించారు. అయితే, అందులోని డేటా ఇప్పటికే పూర్తిగా డిలీట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఫోన్ లో డిలీట్ అయిన డేటాను అధికారులు తిరిగి రిట్రీవ్ చేసే అవకాశం ఉందా? అసలు ఆ డేటాను తిరిగి పొందొచ్చా? అందుకు ఎంతమేరకు అవకాశం ఉంది? డిలీడ్ అయిన డేటాను తిరిగి తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు ఎటువంటి సందర్భాల్లో డిలీట్ అయిన డేటాను తిరిగి తీసుకురావొచ్చు? దీనిపై ఐటీ నిపుణులు నల్లమోతు శ్రీధర్ ఏమన్నారంటే..

”ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన డేటా(రకరకాల డేటా పాయింట్స్..లొకేషన్ డేటా, వాట్సాప్ డేటా) మీద ఆధారపడి ఉంటుంది. కేసుతో ముడిపడి వ్యక్తులు ఉంటే..వారి మధ్య సంభాషణ జరిగి ఉండొచ్చు. ఆ వ్యక్తుల మధ్య ఎలాంటి సంభాషణ జరిగి ఉండొచ్చు. గూగుల్ టేకౌట్, లొకేషన్ డేటా. స్నిప్పెట్స్ ఆఫ్ డేటా. కాల్ లాగ్స్, ఫొటోస్, వీడియోస్.. అంటే లోకల్ స్టోరేజీలో సేవ్ అయినవి. ఫోన్ లో ఇంటర్నల్ స్టోరేజీ లేదా మెమొరీ కార్డు ఉంటాయి. అందులోని డేటాను డిలీట్ చేసినా.. కొన్ని టూల్స్ ఉపయోగించి ఆ డేటాను రికవరీ చేయొచ్చు. కొంతమంది డేటాను మళ్లీ మళ్లీ ఫిల్ చేస్తుంటారు. దాని వల్ల పాత డేటా వెనక్కి వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఫోరెన్సిక్, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ప్రొఫెషనల్ టూల్స్ వాడి డేటాను వెనక్కి తీసుకురావడానికి మ్యాగ్జిమమ్ సక్సెస్ రేట్ సాధించే అవకాశం ఉంది.(Nallamothu Sridhar)

Also Read..Holi 2023 Tips : హోలీ రోజున మీ స్మార్ట్‌ఫోన్ జాగ్రత్త.. పొరపాటున నీళ్లలో ఫోన్ పడితే వెంటనే ఇలా చేయండి.. బెస్ట్ టిప్స్ మీకోసం..!

ఇక ఫోన్ కాన్వర్జేషన్స్, కాల్ లాగ్స్, ఎస్ఎంఎస్ లు, వాట్సాప్ మేసేజ్ ఈ టైప్ నార్మల్ ట్రెడిషన్ కాల్స్ ను.. ఫోన్ సర్వీస్ ప్రొవైడర్(ఎయిర్ టెల్, జియో) ద్వారా ఈ టైప్ డేటాను సేకరించొచ్చు. గతంతో పోలిస్తే.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడకం బాగా పెరిగింది. ప్రతి స్మార్ట్ ఫోన్ లో కూడా.. ఎంతగా డేటాను డిలీట్ చేసినప్పటికీ.. రిట్రీవ్ చేసే విధంగా డేటా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అనేది టెక్నాలజీ పరంగా చాలా సుభంగా మారింది. కచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఎవిడెన్స్ అనేది ఒక బెస్ట్ ఎవిడెన్స్ మన పరిగణించొచ్చు” అని నల్లమోతు శ్రీధర్ చెప్పారు.