Chilakada Beet Cultivation : చిలకడ దుంప సాగులో మేలైన పద్ధతులు!
సాధారణంగా తీగలను నాటి దుంపను ఉత్పత్తి చేస్తారు. కొత్త ప్రాంతాల్లో తీగల కొరకు నారుమళ్ళలో దుంపలను నాటి, తీగలను నేరుగా ప్రధాన పొలంలో నుండి తీసుకున్న తీగల కంటే రెండు నారుమడుల్లో పెంచిన తీగలు ఆరోగ్యమైనవిగా ఉండటమేకాక ధృడంగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి.

Best practices in Chilakada beet cultivation!
Chilakada Beet Cultivation : మురుగు నీటి పారుదల సౌకర్యం గల ఒండ్రు, ఇసుక్క గరప నేలలు సాగుకు అనుకూలం. బంక మట్టి నేలల్లో దుంపలు సరిగా ఊరవు. ఇది ఉష్ణ మండల పంట. ఎక్కువగా సూర్మరళ్ళి తాకుతూ చల్లని రాత్రులు పగటి సమయం తక్కువ. రాత్రి సమయం ఎక్కువ ఉండే కాలంలో దుంపలు బాగా వృద్ధి చెందుతాయి. నీడ ఎక్కువగా ఉంటే దుంపలు సరిగా ఊరవు. ఈ పంట ఎక్కువ వర్షాలు తట్టుకోలేదు.
సాగుకోసం సామ్రాట్, కిరణ్, యస్ 30/21 శ్రీనందిని, శ్రీవర్దిని, వర్ష శ్రీరత్న శ్రీబద్ర రకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పంట తీగల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఒక మోస్తరు లేతగా
ఉన్న తీగలను నాటడానికి ఉపయోగించాలి. సుమారు 20 సెం.మీ పొడవు 2-4 కణుపులు 5-6 ఆకులు ఉన్న తీగలను నాటడానికి ఎంచుకోవాలి. నాటే ముందు తీగను ఫెన్నిటోథయాన్ 2 మి.లీ 1 గ్రా. కార్బండిజమ్ లీటరు నీటికి కలిపిన ద్రావణంలో ముంచి నాటడం వల్ల ముక్క పురుగు తీవ్రతను తగ్గించవచ్చు. ఖరీఫ్ – జూన్, జులై , రబీ – అక్టోబర్, నవంబర్ , వేసవి – ఫిబ్రవరి, మార్చి లో సాగు చేయవచ్చు.
నారుమడులు : సాధారణంగా తీగలను నాటి దుంపను ఉత్పత్తి చేస్తారు. కొత్త ప్రాంతాల్లో తీగల కొరకు నారుమళ్ళలో దుంపలను నాటి, తీగలను నేరుగా ప్రధాన పొలంలో నుండి తీసుకున్న తీగల కంటే రెండు నారుమడుల్లో పెంచిన తీగలు ఆరోగ్యమైనవిగా ఉండటమేకాక ధృడంగా పెరిగి ఎక్కువ దిగుబడినిస్తాయి. 20-80 సెం.మీ పొడవుతో 3-4 కణుపులు ఉన్న తీగలను నాటితే బాగా బతికి ఎక్కువగా దిగుబడినిస్తాయి. తీగలను నాటేటప్పుడు మధ్య భాగాన్ని భూమిలో పూడ్చి, రెండు చివరలు భూమిపై ఉండేటట్లు తీగల్ని నాటాలి. మరో పద్ధతిలో తీగల్ని నిలువుగా కాని, ఏటవాలుగా కాని 2-5, 7-5 సెం.మీ లోతులో నాటాలి.
ఎరువుల యాజమాన్యం : ఎకరానికి 6-8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 25 కి.భాస్వరం, 16 కె. పొటాష్‌ను ఇచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. నత్రజని 2 దఫాలుగా అంటే నాటిన 80 మరియు 60 రోజులకు వేయాలి. 16 కి. పొటాష్‌ను రెండవ దఫాగా నాటిన 60 రోజులకు వేయాలి.
అంతరకృషి : పైరు తొందరగా పెరిగి కలుపు మొక్కల పెరుగుదలను అదుపు చేస్తుంది. నాటిన 15-80 రోజల మధ్యలో ఒకసారి కలుపు తీసి మట్టిని ఎగదోయాలి. దీని వల్ల దుంప నాణ్యత పెరుగుతుంది.
నీటి యాజమాన్యం : తీగలు నాటేటప్పుడు నీటిలో తేమ ఉండాలి. నాటిన వెంటనే నీరు పెట్టాలి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వారానికి ఒకసారి నీరు పెట్టాలి. నాటిన 80 రోజుల వరకు పంట నీటి ఎద్దడికి గురికారాదు. దుంప పెరుగుదల దశలో వారం రోజల వ్యవధిలో నీరు పెట్టాలి. ఈ పంటకు చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ పంటను ఆశించే పురుగుల విషయంలో సరైన సస్యరక్షణ చర్యలను పాటించాల్సిన అవసరం ఉంటుంది.