Bitter Gourd Farming : కాకర తోటల్లో బూజు తెగులును నివారణ పద్ధతులు

Bitter Gourd Farming : కాకరకు  మంచి మార్కెట్  డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగుచేసారు.

Bitter Gourd Farming : కాకర తోటల్లో బూజు తెగులును నివారణ పద్ధతులు

Bitter Gourd Farming Techniques

Updated On : May 30, 2024 / 2:41 PM IST

Bitter Gourd Farming : తెలుగు రాష్ట్రాల్లో పందిరి కూరగాయలను విరివిగా సాగుచేస్తుంటారు. ఇటీవలికాలంలో ఈ పంటలో ట్రెల్లిస్ విధానం రైతుల ఆదరణ పొందుతోంది.  ఈ విధానంలో చీడపీడల సమస్య తక్కువే అయినప్పటికీ, ప్రస్తుత వాతావరణంలో కాకరతోటలకు, బూడిద తెగులు ఉధృతంగా సోకినట్లు  శాస్త్రవేత్తలు గుర్తించారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపడితే ఈ తెగులును నివారించవచ్చంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త , డా. జే. హేమంత్ కుమార్.

Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు 

తీగజాతి కూరగాయాల్లో ముఖ్యమైంది కాకర.  పోషకాలు ఔషధ విలువల పరంగా కాకరది విశిష్టమైన స్థానం. కాకరకు  మంచి మార్కెట్  డిమాండ్ ఉండటంతో ఖమ్మం జిల్లాలో చాలా మంది రైతులు ఈ పంటను ట్రెల్లిస్ విధానంలో సాగుచేసారు. ప్రస్తుతం బూడిద తెగులు ఉధృతమవటంతో పంటనష్టం ఎక్కువ వుందని రైతులు తెలియజేస్తున్నారు. గాలిలో తేమ, మంచు అధికంగా వున్నప్పుడు ఈ  తెగులు ఉధృతి మరింత పెరుగుతుందని, దీని నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు, ప్రధాన శాస్త్రవేత్త , డా. జె. హేమంత్ కుమార్.

తీగజాతి కూరగాయలకు ట్రెల్లిస్ విధానం రైతాంగానికి అత్యంత అనువుగా వుంది. ఈ విధానంలో పందిరిని ఒకచోట నుంచి మరో చోటికి తరలించుకునే వీలుంది. అడ్డు పందిరి కనుక రెండు వరుసల మధ్య అంతరపంటలను కూడా సాగుచేసుకునే వీలుంది. అయితే సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా చీడపీడలను అధిగమిస్తే, తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు పొందవచ్చు.

Read Also : Kharif Season : అధిక దిగుబడినిచ్చే వరంగల్ వరి రకాలు