Sarugudu Cultivation : రైతులకు ఆర్ధిక చేయూతనందిస్తున్న సరుగుడు సాగు

పేపర్ కోసం, పందిళ్ల కోసం కర్రను వాడుతుండగా.. మొక్క మొదలు ఇటుక బట్టీలకు ఉపయోగిస్తుంటారు. పుల్లను వంటచెరుకుగా వినియోగిస్తుండటంతో.. పశ్చమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామ రైతులు కొన్నేళ్లుగా సరుగుడు సాగును చేపడుతున్నారు.

Sarugudu Cultivation : రైతులకు ఆర్ధిక చేయూతనందిస్తున్న సరుగుడు సాగు

Sarugudu Cultivation

Updated On : March 11, 2023 / 8:45 AM IST

Sarugudu Cultivation : నాటిన 5 సంవత్సరాలకు చేతికందే సరుగుడు కలప రైతుకు ఆర్ధికంగా చేయూతను అందిస్తోంది. సురుగుడులో ప్రస్థుతం క్లోన్ మొక్కలు అందుబాటులోకి రావటంతో రైతులు ఎకరాకు 70 నుండి 100 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. వర్షాధారంగా, నీటి వనరులు తక్కువుగా వున్న ప్రాంతాల్లో సరుగుడు సాగు తమకు అన్నివిధాలుగా లాభదాయకంగా వుందంటున్నారు పశ్చమగోదావరి జిల్లా రైతులు.

READ ALSO : Drumstick Cultivation : మునగ సాగులో ఎరువుల యాజమాన్యం!

తక్కువ పెట్టుబడి.. ప్రతికూల పరిస్థితులతో సంబంధం లేకుండా పంట చేతికొచ్చే పరిస్థితులు ఉండటంతో రైతులు అధికంగా ఈ పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తున్నారు రైతులు. బలమైన గాలులు ఉప్పుకు అడ్డుపడి తీరప్రాంత గ్రామాలకు రక్షణ నిలుస్తుంటాయి . ఈ మొక్కల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి.

READ ALSO : Benda Cultivation : బెండ సాగులో తెగుళ్ళు.. నివారణ చర్యలు !

పేపర్ కోసం, పందిళ్ల కోసం కర్రను వాడుతుండగా.. మొక్క మొదలు ఇటుక బట్టీలకు ఉపయోగిస్తుంటారు. పుల్లను వంటచెరుకుగా వినియోగిస్తుండటంతో.. పశ్చమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామ రైతులు కొన్నేళ్లుగా సరుగుడు సాగును చేపడుతున్నారు. 4 ఏళ్ల లోచేతికొచ్చే ఈ పంట ఎకరాకు 75 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంతో పోల్చిస్తే లాభాలు తగ్గాయని చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్రింది వీడియో పై క్లిక్ చేయండి.