Benda Cultivation : బెండ సాగులో తెగుళ్ళు.. నివారణ చర్యలు !

గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజులలో మొక్కలు పడిపోయి చనిపోతాయి. ఈ సమస్య నల్లరేగడి నెలల్లో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కొరకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి వేసి కలియ దున్నాలి.

Benda Cultivation : బెండ సాగులో తెగుళ్ళు.. నివారణ చర్యలు !

Pests in Banda Cultivation.. Preventive Measures!

Benda Cultivation : వార్షిక కూరగాయ పంట బెండ. ఉష్ణ సమ శీతోష్ణ మండల ప్రాంతాలలో దీనిని పండిస్తారు. లేత కాయలను కూరగాయగా ఉపయోగిస్తారు. బెండ వరుగులను చాలా ప్రాంతాలలో వాడతారు . తాజా కాయలకు గల్ఫ్ దేశాల్లో మంచి గిరాకీ ఉంది. లేత బెండకాయలను వివిధ రకాల వంటల తయారీలో ఉపయోగిస్తారు . బెండ వేర్లు, కాండం నుండి వచ్చిన రసాన్ని చెరుకు రసం శుభ్రపరచడానికి బెల్లం చక్కెర పరిశ్రమలలో వాడుతారు. ముదిరిన కాండం కాయల నుండి తీసిన నారను కాగితపు పరిశ్రమలో ఉపయోగిస్తారు.

మనదేశంలో వ్యాపార సరళిలో గుజరాత్ ,మహారాష్ట్ర , తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు ,కర్ణాటక , హర్యానా మరియు పంజాబ్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు.బెండలో హైబ్రిడ్ రకాలు కు ధీటుగా సాధారణ రకాలు దిగుబడి ఇస్తున్నాయి.

బెండలో తెగుళ్ళు:-

బూడిద తెగులు:- ఆకుల పైన బూడిద వంటి పొడి తో కప్పబడి ఉంటుంది. తెగులు ఉధృతి ఎక్కువైతే ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి. ఈ తెగులు నివారణ కొరకు లీటర్ నీటికి 3 గ్రాముల గంధకం పొడి లేదా 1 మి.లీ కెరాథన్ లేదా హెక్సాకొనజోల్ 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.

READ ALSO : Cotton : రైతుకు మేలు చేసే… అధిక సాంద్రత పద్ధతిలో పత్తిసాగు

పల్లాకు తెగులు: తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగుకు మారి, కాయలు గిడసబారి తెల్లగా మారిపోతాయి. దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి. దీని నివారణ కొరకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలి. తెగుళ్ళను తట్టుకునే రకాలైన అర్క అనామిక, అర్క అభయ, పర్బని క్రాంతి వంటి రకాలను ఎంపిక చేసుకుని సాగు చేసుకోవాలి.

తెగులు నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రా కిలో విత్తానానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఆలస్యంగా విత్తిన పంటకు ఈ తెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి పంటను జూలై 15 లోపు విత్తుకుంటే మంచిది. ఈ తెగులు తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది కాబట్టి సకాలంలో అంతర్వాహిక క్రిమిసంహారక మందులను ఉపయోగించి అరికట్టాలి. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి.

ఎండు తెగులు: గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజులలో మొక్కలు పడిపోయి చనిపోతాయి. ఈ సమస్య నల్లరేగడి నెలల్లో ఎక్కువగా ఉంటుంది. దీని నివారణ కొరకు ఆఖరి దుక్కిలో ఎకరానికి 100 కిలోల వేప పిండి వేసి కలియ దున్నాలి. మొక్కల మొదళ్ల వద్ద కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి ద్రావణాన్ని పోయాలి. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు ఈ విధంగా చేయాలి. పంట మార్పిడి ని తప్పనిసరిగా అవలంబించాలి.

READ ALSO : Drumstick Farming : మునగసాగులో అధిక దిగుబడినిచ్చే రకాలు ఇవే…

కోత కోయడం:- గింజలు విత్తిన 45 నుండి 50 రోజులకు మొదటి కోత వస్తుంది. పిందె కట్టిన నాలుగు నుండి ఆరు రోజులకు కోస్తే కాయ నాణ్యత బాగుంటుంది. ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి కాయలు కోయాలి లేదంటే కాయలు ముదిరి, పనికి రాకుండా పోతాయి.