Cm Revanth Reddy: సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, ఇంకా.. కొడంగల్ పై సీఎం రేవంత్ వరాల జల్లు..

రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం, రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Cm Revanth Reddy: సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, ఇంకా.. కొడంగల్ పై సీఎం రేవంత్ వరాల జల్లు..

Updated On : November 24, 2025 / 6:16 PM IST

Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంపై వరాల జల్లు కురిపించారు. రూ.103 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 5.83 కోట్లతో 28 అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, రూ. 5.01 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 23 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.3 కోట్లతో 10 GP భవనాల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

ఇంకా రూ.3.65 కోట్లతో బంజారా భవన్ కోసం అదనపు సౌకర్యాలు (కాంపౌండ్ వాల్, డైనింగ్ హాల్, నీటి సరఫరా, విద్యుదీకరణ).. కోటి రూపాయలతో కొడంగల్‌లో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. రూ.1.30 కోట్లతో అగ్నిమాపక కేంద్రం నిర్మాణం, రూ. 1.40 కోట్లతో కొడంగల్‌లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం, రూ. 4.91 కోట్లతో కమ్యూనిటీ హాళ్లు, కిచెన్ షెడ్లు, కాంపౌండ్ వాల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

రూ. 4.45 కోట్లతో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇక రూ.2.95 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదులు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయ భవనాలను ప్రారంభించారు. రూ.60 కోట్లతో కొడంగల్ పట్టణంలో రోడ్డు విస్తరణ, రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం, రూ. 4.50 కోట్లతో కోస్గి వ్యవసాయ మార్కెట్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Also Read: పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..