Coconut Cocoa Plantation : కొబ్బరి, కోకో తోటలో ఆరుతడిపంటగా వరిసాగు
Coconut Cocoa Plantation : యువరైతు ప్రయోగాత్మకంగా తన కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అరటి లాంటి పంటలను సాగుచేస్తూనే... ఆరుతడి పంటగా వరి కూడా సాగుచేస్తున్నారు.

Agriculture Tips
Coconut Cocoa Plantation : రైతులు తమ వ్యవసాయ విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే పద్ధతులను అలవర్చుకుంటూ ముందుకుపోతున్నారు. ముఖ్యంగా ఉద్యాన తోటల్లో అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను సాగుచేయడం ఇప్పటి వరకు చూశాం. కానీ ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు ప్రయోగాత్మకంగా తన కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, వక్క, అరటి లాంటి పంటలను సాగుచేస్తూనే… ఆరుతడి పంటగా వరి కూడా సాగుచేస్తున్నారు. మరి ఆరైతు ఆచరిస్తున్న సాగు విధానాలేంటో ఇప్పుడు చూద్దాం…
ఉన్నది ఎనిమి ఎకరాల వ్యవసాయ భూమి. దాంట్లో కొబ్బరి తోట. అయితే ఏడాదికి దాని నుండి ఒక సారే పంట దిగుబడి. అప్పటి వరకు ఆదాయం రాదు. మరి ఉన్న భూమిని ఎలా వాడాలి, ఎలా ఆదాయం పొందాలి అని ఆలోచించారు ఏలూరు జిల్లా, ఉంగుటూరు మండలం, వెలమిల్లి గ్రామానికి చెందిన రైతు రాజేంద్ర ప్రసాద్. కొబ్బరి తోటలో ప్రయోగాత్మకంగా పలు రకాల అంతర పంటలు సాగుచేస్తూ.. విజయం సాదిస్తున్నారు.
రైతు రాజేంద్ర ప్రసాద్ చదివింది మెకానికల్ ఇంజనీర్.. కొన్నాళ్ళపాటు ఉద్యోగం కూడా చేశారు. అయితే కొన్ని కారణాల రిత్య సొంతూరికి చేరుకోవాల్సి వచ్చింది. ఇంటివద్దే ఉంటూ.. వ్యవసాయం చేయాలనుకున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలతో తనకు 8 ఎకరాల కొబ్బరి తోటలో అంతర పంటలుగా కోకో, బోప్పాయి, అరటి, వక్క లాంటి మొక్కలను నాటారు. అయినా మొక్కల మధ్య ఖాళీస్థలాన్ని కూడా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో గత ఏడాది అంతర పంటలుగా కూరగాయలను సాగుచేసి విజయం సాధించారు. ఈ ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా ఎకరం తోటలో దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు.
రైతు ఆరోగ్యం కాపాడుకునేందుకు ఎలాంటి రసాయనాలు లేని ఆహారం తిలాలనుకొని పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది రెండు దేశీ వరిరకాల సాగు చేపట్టారు. ప్రస్తుతం పొట్టదశలో ఉన్నాయి. సాధారణంగా వరికి చాలా నీరు అవసరం కానీ ఈ రైతు ఆరుతడి పద్ధతిలోనే పండిస్తూ.. ఇందులో విజయం సాధించారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు