Kandi Cultivation : కందిలో పెరిగిన చీడపీడల బెడద.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

కంది పంటను శాకీయ దశలో , పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయతొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి.

Kandi Cultivation : కందిలో పెరిగిన  చీడపీడల బెడద.. నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు

Kandi Cultivation

Kandi Cultivation : కందిలో చీడపీడల ఉదృతి పెరింగింది. వివిధ ప్రాంతాల్లో ప్రస్తుత పూత, పిందె దశలో ఉంది. ఈ సున్నితమైన దశలో  ఎండుతెగులు , మారుకామచ్చల పురుగు, శనగపచ్చపురుగులు ఆశించిన తీవ్రనష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు మంచిర్యాల జిల్లా,  బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు .

READ ALSO : YCP MP Vijayasai Reddy: చంద్రబాబు రాజకీయ జీవితం 2023 వరకేనా? ఎలా అంటే.. విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్

ఖరీఫ్ కంది పంటకాలం, సాగుచేసిన రకాన్నిబట్టి 150 నుండి 180 రోజులు. ఈ సారి రుతుపవనాలు కూడా సకాలంలో రావడంతో సమయానికి కందిని విత్తారు. అయితే తెలంగాణలో నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ సారి కంది విస్తీర్ణం భాగా పెరిగింది. అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చేలలో నీరు నిలిచి ఎండుతెగులు, ఫైటోఫ్తోరా, మాక్రోఫోమినా తెగులు ఆశించాయి. తద్వారా పంట మొత్తం ఎండిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు  మంచిర్యాల జిల్లా,  బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త నాగరాజు .

READ ALSO : AP CM Jagan: రాజమండ్రి జైలుకు చంద్రబాబు.. లండన్ నుంచి తిరిగి రానున్న సీఎం జగన్ .. ఏపీకి ఏ సమయానికి చేరుకుంటారంటే..

కంది పంటను శాకీయ దశలో , పూత సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కాయతొలిచే పురుగులు అధికంగా ఆశించి తీవ్రంగా నష్టపరుస్తుంటాయి. రైతులు ఎప్పటికప్పుడు పంటను గమనిస్తూ ఉండాలి. పురుగుల ఉదృతి గుర్తించినట్లైతే శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ.. నివారణ చర్యలను చేపట్టాలి.