Dragon Fruit : అమెరికన్ బ్యూటీ డ్రాగన్ ఫ్రూట్ సాగు

మొదటి ఏడాది కొద్దిపాటి దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది 4 టన్నల వరకు వచ్చింది. ప్రస్తుతం 3వ పంట.. ఇప్పటికే 4 టన్నుల దిగుబడిని పొందిన ఈ రైతు మరో 2 నెలల వరకు దిగుబడులు వస్తాయని చెబుతున్నారు.

Dragon Fruit : డ్రాగన్ ఫ్రూట్.. పెట్టుబడి ఎక్కువే అయినా.. నాటిన 25, 30 ఏళ్ల పాటు దిగుబడి వస్తుండటంతో రైతులు వీటి సాగుకు మొగ్గుచూపుతున్నారు. అంతే కాదు శ్రమ తక్కువ.. కూలీల అవసంర కూడా ఉండదు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తరించిది. ఈ కోవలోనే ఎన్టీఆర్ జిల్లా కు చెందిన ఓ రైతు పావుదక్కువ రెండు ఎకరాల్లో సాగుచేసి సత్ఫలితాలను పొందుతున్నారు.

READ ALSO : Rajinikanth : జైలర్ సినిమా నాకు ఎబోవ్ యావరేజ్ అనిపించింది.. రజినీకాంత్ సంచలన వ్యాఖ్యలు..

ఒకప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అంటే మార్కెట్ లో యమ డిమాండ్ ఉండేది. కిలో 300 ల వరకు పలికేది. అందుకే  రైతులు తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగును చేపట్టారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎకరంలోనో, అరఎకరంలోనో  డ్రాగన్ ఫ్రూట్ సాగు కనబడుతూనే ఉంది. అయితే దీనికి పెట్టుబడి ఎక్కువే అయినా.. దిగుబడి నాటిన 25 నుండి 30 ఏళ్ల వరకు వస్తుంది కాబట్టి రైతులు వీటి సాగుకు మొగ్గుచూపారు. దీంతో దిగుబడి పెరిగింది.

READ ALSO : Chandrababu Arrest : ఏం జరగనుంది? నేడే చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో విచారణ, సర్వత్రా తీవ్ర ఉత్కంఠ

మార్కెట్ లో పండ్ల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయినా నష్టంలేదంటూ.. సాగుచేస్తూనే ఉన్నారు… ఈ కోవలోకే వస్తారు ఎన్టీఆర్ జిల్లా, పెనగంచిప్రోలు మండలం, పెనగంచిప్రోలు గ్రామానికి చెందిన రైతు పెద్ది మోహన్ రావు. తనకున్న వ్యవసాయ భూమిలో ఎకరం 75 సెంట్లలో మూడేళ్లక్రితం అమెరికన్ బ్యూటీ రకాన్ని నాటారు.

READ ALSO : Pawan Kalyan : మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కల్యాణ్ రియాక్షన్

నాటిన మొదటి ఏడాది కొద్దిపాటి దిగుబడి వచ్చినా.. రెండో ఏడాది 4 టన్నల వరకు వచ్చింది. ప్రస్తుతం 3వ పంట.. ఇప్పటికే 4 టన్నుల దిగుబడిని పొందిన ఈ రైతు మరో 2 నెలల వరకు దిగుబడులు వస్తాయని చెబుతున్నారు. వచ్చిన దిగుబడిని వ్యాపారులకు అమ్మకుండా తన పొలం వద్దే ఔట్ లేట్ పెట్టి కిలో రూ. 200 చొప్పున అమ్ముతున్నారు. దీంతో అధిక ఆదాయం పొందుతున్నారు. మరో రెండేళ్లలో పెట్టిన పెట్టుబడి చేతికి వస్తుందని.. ఆతరువాత వచ్చేదంతా.. నికర ఆదాయమేనంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు