Chandrababu Arrest : ఏం జరగనుంది? నేడే చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో విచారణ, సర్వత్రా తీవ్ర ఉత్కంఠ

చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో.. Chandrababu Arrest

Chandrababu Arrest : ఏం జరగనుంది? నేడే చంద్రబాబు పిటిషన్లపై హైకోర్టులో విచారణ, సర్వత్రా తీవ్ర ఉత్కంఠ

Chandrababu Arrest - AP High Court

Chandrababu Arrest – AP High Court : ఏపీ హైకోర్టులో రేపు(సెప్టెంబర్ 19) విచారణం జరగనుంది. మూడు కేసుల్లో దాఖలైన పిటీషన్లపై విచారణ చేపట్టనుంది న్యాయస్థానం. ఇప్పటికే క్వాష్ పిటీషన్ దాఖలు చేయగా, రేపటికి వాయిదా పడింది. క్వాష్ పిటీషన్ కొట్టివేయాలని సీఐడీ విజ్ఞప్తి చేసింది. అయితే, దీనిపై మంగళవారం వాదనలు జరగనున్నాయి.

ఇక మరోవైపు చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దంటూ దాఖలు చేసిన పిటీషన్ తో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అవకతవకల కేసులో ముందస్తు బెయిల్ పై విచారణ చేపట్టనుంది ధర్మాసనం. ఈ పిటీషన్లపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

అటు హైకోర్టులోనూ, ఇటు ఏసీబీ కోర్టులోనూ కీలక పరిణామాలు జరగబోతున్నాయి. చంద్రబాబుకి సంబంధించి మూడు కేసులు ఒకటి క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని చెప్పి మొత్తం టీడీపీ న్యాయవాదులు హైకోర్టుని ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదనలను రేపు హైకోర్టు వినబోతోంది. చంద్రబాబుపై పెట్టిన కేసులు, ఆయనపై నమోదు చేసిన సెక్షన్లు, ఆయనపై ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో అన్నీ తప్పుల తడకలుగా ఉన్నాయని, కాబట్టి నమోదు చేసిన కేసులన్నీ కొట్టివేయాలని, అసలు ఎఫ్ఐఆర్ నే కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపై విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.(Chandrababu Arrest)

Also Read..Brahmani Nara : చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాల్లోకి నారా బ్రాహ్మణి..? పార్టీ కష్టాల్లో ఉండటంతో బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధం

రేపు ఉదయం 10.30గంటల తర్వాత దీనికి సంబంధించిన వాదనలు రేపు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కౌంటర్ పిటిషన్ వేయాలని ఇదివరకే సీఐడీ లాయర్లకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేపు క్వాష్ పిటిషన్ పై రేపు హైకోర్టులో సుదీర్ఘమైన వాదనలు జరగనున్నాయి.

ఇక చంద్రబాబుని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, చంద్రబాబు అరెస్టే అక్రమం అని హైకోర్టుకి వెళ్లిన నేపథ్యంలో ఆయనను కస్టడీకి ఇవ్వాలని సీఐడీ న్యాయవాదులు వేసిన పిటిషన్ లో అర్థం లేదని, ఆయనను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని టీడీపీ లాయర్లు హైకోర్టుని ఆశ్రయించారు. దీనికి సంబంధించి కూడా రేపు హైకోర్టులో వాదనలు వినే అవకాశం ఉంది. దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని సీఐడీ లాయర్లకు హైకోర్టు చెప్పింది. ఇరువర్గాల వాదనలను రేపు హైకోర్టు వినే అవకాశం ఉంది.

మూడో పిటిషన్.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కు సంబంధించినది. దీనిపై రేపు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని, సొంత కంపెనీలకు, సొంత సంస్థలకు, కావాల్సిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేలా ఉందనే అభియోగం ఉంది.

Also Read..TDP: తెరపైకి బిగ్ బీ.. తెలుగుదేశం పార్టీకి ట్రబుల్ షూటర్స్ దొరికేశారా?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో చంద్రబాబు ఏ-1 నిందితుడిగా ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టుని ఆశ్రయించారు టీడీపీ న్యాయవాదులు. ఈ మూడు అంశాలకు సంబంధించి మంగళవారం హైకోర్టులో సుదీర్ఘమైన వాదోపవాదాలు జరగనున్నాయి. క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తుందా? అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబుకి ముందస్తు బెయిల్ లభిస్తుందా? వీటిపై హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అనేది సర్వత్రా తీవ్ర ఉత్కంఠగా మారింది.(Chandrababu Arrest)