Pawan Kalyan : మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కల్యాణ్ రియాక్షన్

చట్టసభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసి ఈ బిల్లు విషయమై వాగ్ధానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో శ్రీ మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారు.

Pawan Kalyan : మహిళా రిజర్వేషన్ బిల్లుపై పవన్ కల్యాణ్ రియాక్షన్

Pawan Kalyan..Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు (Womens Reservation Bill)పై జనసేన (Jana Sena)అధినేత వవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం పలకటంపై హర్షం వ్యక్తం చేశారు జనసేనాని. ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ (PM Narendra Modi Cabinet )కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill)కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో మగ్గిపోతున్న ఈ బిల్లుకు ప్రధాని మోదీ ప్రభుత్వం విముక్తి కల్పిస్తుందనే ఆశ దేశ వ్యాప్తంగా మహిళలు నెలకొంది. మోదీ కేబినెట్ మహిళా బిల్లుకు ఆమోదం తెలపటంతో హర్షం వ్యక్తమవుతోంది.

దీనిపై ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు ట్వీట్ల ద్వారా తమ తమ హర్షాలను..అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈక్రమంలో జనసేనాని స్పందిస్తు..‘ చట్టసభల్లో మహిళామణుల ప్రాతినిథ్యం పెంచాలనే వనితా లోకం ఆకాంక్షలు నెరవేరే రోజులు సమీపంలోనే ఉన్నాయి. ఇందుకు అవసరమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం కేబినెట్ ఆమోదం తెలపటం, ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేవపెట్టాలని నిర్ణయం తీసుకోవటం హర్షణీయం. చారిత్రాత్మకమైన ఈ బిల్లు కేబినెట్ సమావేశంలో ఆమెదం పొందేలా కృషి చేసిన గౌవర ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందులు తెలియజేస్తున్నాను.

చట్టసభల్లో 33 శాతం స్థానాలు మహిళలకు దక్కేలా చేసి ఈ బిల్లు విషయమై వాగ్ధానాలు, నినాదాలకు పరిమితం కాకుండా కార్యరూపం దాల్చేలా చేయడంలో శ్రీ మోదీ ఎంతో చిత్తశుద్ధి చూపారు. ఈ బిల్లు చట్టసభల్లోను ఆమోదం పొందితే కచ్చితంగా రాజకీయంగా మహిళా సాధికారత సాధ్యమవుతుంది. సంక్షేమం, అభివృద్ధితో పాటు మహిళా రక్షణ, విద్య, వైద్యం లాంటి అంశాల్లో మహిళా ప్రతినిధులు విలువైన చర్చలు చేయగలరు. కావున ఈ బిల్లును చట్టసభల సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదించాలని ఆశిస్తున్నాను. అని జనసేనాని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. జనసేన పార్టీ ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు.

poonam kaur : మహిళా రిజర్వేషన్ బిల్లుపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

ఎంతోకాలంలో పెండింగ్ లోనే మగ్గిపోతున్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం ఆమోదం తెలటమే కాదు దీన్ని పార్లమెంట్ లో మంగళవారం (సెప్టెంబర్ 19,2023 సభలో ప్రవేశపెట్టనున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రభుత్వం తీసుకువస్తుందని చెబుతున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే ఇక పార్లమెంట్ సభల్లో మహిళ ప్రాతినిథ్యం పెరగనుంది. ప్రస్తుతం లోక్ సభలో మహిళా సభ్యుల వాటా 14.94 శాతం. రాజ్యసభలో వారి ప్రాతినిధ్యం 14.05 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కేవలం ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రస్తుతం మహిళా ప్రతినిధుల వాటా 10శాతం లోపే ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో మొదటిసారి 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. 2008లో రాజ్యసభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టగా.. 2010లో ఆమోదం పొందింది. కానీ లోక్ సభలో దాదాపు కొన్నేళ్లపాటు దాన్ని పక్కన పెట్టడంతో వీగిపోయింది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోదీ ప్రభుత్వం మళ్లీ ఇప్పుడు ఈ బిల్లుపు సభలో ప్రవేశపెట్టనుంది.