Sarugudu Cultivation : తక్కువ పెట్టుబడితో రైతుకు ఆర్ధిక చేయూతనిస్తున్న సరుగుడు కలప సాగు
పేపర్ కోసం, పందిళ్ల కోసం కర్రను వాడుతుండగా.. మొక్క మొదలు ఇటుక బట్టీలకు ఉపయోగిస్తుంటారు. పుల్లను వంటచెరుకుగా వినియోగించవచ్చు. పశ్చమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామ రైతులు కొన్నేళ్లుగా సరుగుడు సాగును చేస్తున్నారు.

Sarugudu Cultivation
Sarugudu Cultivation : ఒకసారి నాటితే 5 సంవత్సరాలకు చేతికందే సరుగుడు కలప రైతుకు ఆర్ధికంగా చేయూతను అందిస్తోంది. సురుగుడులో ప్రస్థుతం క్లోన్ మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. రైతులు ఎకరాకు 70 నుండి 100 టన్నుల వరకు దిగుబడి తీయవచ్చు.
READ ALSO : Rice Seed Production : వరి విత్తనోత్పత్తితో లాభాలు ఆర్జిస్తున్న రైతు
వర్షాధారంగా, నీటి వనరులు తక్కువుగా వున్న ప్రాంతాల్లో సరుగుడు సాగు రైతులకు అన్నివిధాలుగా లాభదాయకంగా వుంటుంది. ప్రస్తుతం పశ్చమగోదావరి జిల్లా రైతులు సరుగుడు సాగు వైపు ఆసక్తి చూపిస్తున్నారు.
తక్కువ పెట్టుబడి.. ప్రతికూల పరిస్థితులతో తట్టుకుని పంట చేతికొచ్చే పరిస్థితులు ఉండటంతో రైతులు అధికంగా ఈ పంటను సాగుచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా సముద్రతీర ప్రాంతాల్లోని రైతులు అధికంగా సరుగుడు సాగు చేస్తున్నారు . బలమైన గాలులు ఉప్పుకు అడ్డుపడి తీరప్రాంత గ్రామాలకు రక్షణ నిలుస్తాయి. ఈ మొక్కల వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నాయి.
READ ALSO : Dairy Farm : వానాకాలం పాడిపరిశ్రమలో జాగ్రత్తలు
పేపర్ కోసం, పందిళ్ల కోసం కర్రను వాడుతుండగా.. మొక్క మొదలు ఇటుక బట్టీలకు ఉపయోగిస్తుంటారు. పుల్లను వంటచెరుకుగా వినియోగించవచ్చు. పశ్చమగోదావరి జిల్లా, మొగల్తూరు మండలం, పేరుపాలెం గ్రామ రైతులు కొన్నేళ్లుగా సరుగుడు సాగును చేస్తున్నారు. 4 ఏళ్ల లో కాలానికి చేతికొచ్చే ఈ పంట ఎకరాకు 75 నుండి 10 టన్నుల దిగుబడి వస్తుంది. వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంతో పోల్చిస్తే లాభాలు తగ్గాయని రైతులు చెబుతున్నారు.