Dairy Farming : విజయ పథంలో గేదెల డెయిరీ..
2 ఎకరాల్లో డెయిరీకి షెడ్ లను ఏర్పాటు చేశారు. స్వంత భూమిలో ఈ డెయిరీని ప్రారంభించి దినదినాభివృద్ధి చెందారు. ప్రతిరోజు 3,500 లీటర్ల పాలదిగుబడిని పొందుతున్నారు. వచ్చిన పాలను రామసీత బ్రాండ్ పై దాదాపు రోజుకు రెండు నుండి 2 వేల 500 లీటర్ల పాలు అమ్ముతూ.. మిగితా వాటిని ఉపఉత్పత్తులుగా తయారుచేసి విక్రయిస్తున్నారు.

Dairy farming
Dairy Farming : వ్యవసాయానికి అనుబంధంగా, రైతుకు శాశ్వత ఉపాధిని కల్పిస్తున్న రంగం పాడిపరిశ్రమ. పెట్టిన పెట్టుబడి… పెంచే పశుజాతి.. పాటించే నిర్వాహనబట్టే.. ఈ రంగంలో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. పాడి పరిశ్రమలో నష్టం వచ్చిందంటే అది కచ్చితంగా మన స్వయంకృతాపరాధమే. పశుపోషణను ఉపాధిగా మలుచుకుని, కంటికి రెప్పలా ఈ పరిశ్రమను వెన్నంటి వున్న వారికి లాభాలకు కొదవ ఉండదని నిరూపిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రైతు కర్రీ పుత్రారెడ్డి. 14 ఏళ్లుగా గేదెల డెయిరీ నిర్వాహణతో సత్ఫలితాలను సాధిస్తున్నారు.
READ ALSO : Sheep And Goats : గొర్రెలు, మేకల్లో హిమాంకోసిస్ వ్యాధి
తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలానికి చెందిన రైతు కర్రీ పుత్రారెడ్డి పద్నాఏళ్ల క్రితం వ్యవసాయానికి అనుబంధంగా పశుపోషణ చేపట్టారు. వ్యవసాయం కంటే ఆర్థికంగా పశుపోషణ లాభంగా ఉండటం గమనించి, క్రమేపి డెయిరీని విస్తరించారు. 6 గేదెలు 2 ఆవులతో ప్రారంభించిన ఈయన ఫామ్.. నేడు 500 గేదెలు 60 ఆవులకు చేరుకుంది. వీటితోపాటు మరో 300 పైనే దూడలు, పడ్డలు వుంటాయి.
READ ALSO : Quail Bird Farming : కౌజు పిట్టలకు మార్కెట్ లో మంచి డిమాండ్.. నిరుద్యోగులకు ఉపాధినిస్తున్న పెంపకం
2 ఎకరాల్లో డెయిరీకి షెడ్ లను ఏర్పాటు చేశారు. స్వంత భూమిలో ఈ డెయిరీని ప్రారంభించి దినదినాభివృద్ధి చెందారు. ప్రతిరోజు 3,500 లీటర్ల పాలదిగుబడిని పొందుతున్నారు. వచ్చిన పాలను రామసీత బ్రాండ్ పై దాదాపు రోజుకు రెండు నుండి 2 వేల 500 లీటర్ల పాలు అమ్ముతూ.. మిగితా వాటిని ఉపఉత్పత్తులుగా తయారుచేసి విక్రయిస్తున్నారు.ప్రస్తుతం ఇక్కడ ఉన్న గేదెలు, ఆవులన్నీ చాలా వరకు ఫామ్ లో అభివృద్ధి చెందినవే. 6 , 7 ఈతల తరువాత వాటిని తీసివేసి , ఎదిగిన దూడలను చూడికట్టించి మందలో కలుపుతారు.
READ ALSO : Azolla Cultivation : పాడిపశువవులు, కోళ్లు, జీవాలకు మేతగా అజొల్లా.. అజొల్లా సాగుతో తగ్గనున్న పశుగ్రాసం ఖర్చు
సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో పశుపోషణలో ముందడుగు వేసే పుత్రారెడ్డి.. 80 ఎకరాల్లో పచ్చిమేత కోసం సూపర్ నేపియర్ గడ్డి పెంపకాన్ని చేపట్టారు. అంతే కాదు పచ్చిగడ్డితో పాటు మినరల్ మిక్షర్ ను కూడా అందిస్తూ.. లాభాల భాటలో పయనిస్తున్నారు.