Sheep And Goats : గొర్రెలు, మేకల్లో హిమాంకోసిస్ వ్యాధి

ఈ తరహాలో ఈ రక్తనులి పురుగులు జీవాల్లో జీవనం సాగిస్తూ వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వీటి ప్రభావం వల్ల గొర్రెల పెరుగుదలకు, మాంసోత్పత్తికి తీవ్ర అవరోధం వాటిల్లుతుంది.

Sheep And Goats : గొర్రెలు, మేకల్లో హిమాంకోసిస్ వ్యాధి

Sheep And Goats (1)

Sheep And Goats : గొర్రెలు, మేకల్లో హిమాంకోసిస్ వ్యాధి కనిపిస్తుంటుంది. దీనినే రక్తనులి పురుగు అని కూడా పిలుస్తారు. ఈ రక్తనులి పురుగు జీవాల పొట్టలో రక్తం తాగుతూ నివశిస్తుంది. ఈ పరాన్నజీవి సన్నగా తెల్లగా గుండ్రంగా నూలిపోగు వలె ఉంటుంది. రోజుకు 0.01మిల్లీ లీటర్ల రక్తాన్ని తాగుతూ వవీటి సంతతిని వృద్ధిచెందేలా చేస్తుంది. గుడ్లను పేడ ద్వారా బయటకు విస్తర్జిస్తుంది. ఈ గుడ్లు పేడ ద్వారా బయటకు వచ్చి నేలపై పొదగబడతాయి. తిరిగి లార్వాలా మారి గడ్డి ఆకులకు అతుక్కుని మళ్ళీ మేత ద్వారా గొర్రెలు, మేకల శరీరంలోకి ప్రవేశిస్తాయి.

ఈ తరహాలో ఈ రక్తనులి పురుగులు జీవాల్లో జీవనం సాగిస్తూ వాటి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంటాయి. వీటి ప్రభావం వల్ల గొర్రెల పెరుగుదలకు, మాంసోత్పత్తికి తీవ్ర అవరోధం వాటిల్లుతుంది. గొర్రెల్లో వీటి లార్వా వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చే ప్రమాదం వాటిల్లుతుంది. కొన్ని సందర్భాల్లో జీవాలు మృత్యువాత పడతాయి. గొర్రె పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద జీవాల్లో రక్తహీనత తప్ప ఇతర వ్యాధి లక్షణాలు పెద్దగా కనిపించవు.

వ్యాధి లక్షణాలు ;
జీవాల పొట్టలో ఎక్కువ పరాన్నజీవులు ఉంది వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు గొర్రెలు ఎటువంటి లక్షణాలు లేకుండానే మృత్యువాత పడుతుంటాయి. ఆకలి మందగించి మేత, నీరు సరిగా తీసుకోవు. ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవటానికి ఇష్టపడతాయి. మందలో వెనుక పడి నిధానంగా నడుస్తూ అడుగులు తడబడుతూ సాగుతుంటాయి. ఇలాంటి వాటిని గుర్తించి సకాలంలో పశువైద్యులను సంప్రదించి తగిన చికిత్స పొందాలి. లేకుంటే జీవల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది.