Vijay Deverakonda: రౌడీ హీరో బాలీవుడ్ ఎంట్రీ.. క్రేజీ డైరెక్టర్ తో ముంబై వెళ్లిన విజయ్ దేవరకొండ
బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda).
Maddock Films planning a movie with Vijay Deverakonda and Vikram K Kumar
- విక్రమ్ కుమార్‌తో విజయ్ క్రేజీ కాంబో.
- బాలీవుడ్ ప్రొడక్షన్లో భారీ చిత్రం.
- హార్స్ రైడర్‌గా రౌడీ బాయ్.
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘రణబాలి’, ‘రౌడీ జనార్ధన’ సినిమాల షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేని ఈ హీరో ఈ రెండు సినిమాలతో భారీ కంబ్యాక్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, ఇటీవలే శౌర్యువ్ డైరెక్షన్లో మరో పాన్ ఇండియా సినిమాను ఒకే చేశాడు. ఈ మూవీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఇలా లైన్లో ఉండగానే, విజయ్ దేవరకొండ సైలెంట్‌గా మరో క్రేజీ అప్డేట్తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
Varanasi: ‘వారణాసి’ నుంచి మళ్ళీ లీక్స్.. ఈసారి కీ సీన్స్ కూడా.. టెన్షన్ లో రాజమౌళి టీం
సరికొత్త కాన్సెప్ట్‌లతో మెప్పించే టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె. కుమార్ ఇదివరకే విజయ్(Vijay Deverakonda)కి ఒక మైండ్ బ్లోయింగ్ స్క్రిప్ట్ వినిపించారు. శౌర్యువ్ ప్రాజెక్ట్ అనౌన్స్ కావడంతో ఈ సినిమా డ్రాప్ అయిందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా ఈ క్రేజీ కాంబోను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు విజయ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ బిగ్ బడ్జెట్ మూవీని బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ ‘మడాక్ ఫిల్మ్స్’ నిర్మించబోతున్నట్లు ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించిన అఫీషియల్ డీల్ కోసమే విజయ్, విక్రమ్‌తో కలిసి ముంబయి వెళ్లి సదరు మేకర్స్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సరికొత్త జోనర్లో ఉండబోతోంది. ఇందులో విజయ్ మునుపెన్నడూ చూడని లుక్‌లో ‘హార్స్ రైడర్’గా అలరించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. శౌర్యువ్ సినిమా ఈ ఏడాది చివర్లో స్టార్ట్ కానుండగా, విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది ప్రారంభంలో పట్టాలెక్కనుంది. అయితే, ఇది పక్కా బాలీవుడ్ సినిమాగా తెరకెక్కుతుందా, లేక తెలుగు ప్రాజెక్టులానే రిలీజ్ అవుతుందా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఈ రెండు ప్రాజెక్టులను ఒకేసారి పారలల్‌గా కంప్లీట్ చేయాలని విజయ్ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు.
