Peddi Overseas: ఓవర్సీస్లో ‘పెద్ది’ టార్గెట్ ఎంతో తెలుసా.. రామ్ చరణ్ కి సాధ్యమేనా?
రామ్ చరణ్ పెద్ది సినిమాకు ఓవర్సీస్(Peddi Overseas) లో భారీ టార్గెట్.
Massive Target for Ram Charan peddi at Overseas belt
- యూఎస్ మార్కెట్లో ‘పెద్ది’ హవా.
- బ్రేక్ ఈవెన్ లక్ష్యం 6 మిలియన్లు.
- రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్.
Peddi Overseas: తెలుగు సినిమాలకు నార్త్ అమెరికా (USA) మార్కెట్ అనేది ఎప్పుడూ ఒక ప్రధాన మార్కెట్ గా మారింది. అయితే కొన్నేళ్లుగా అక్కడ మన చిత్రాలు ఊహించిన స్థాయిలో ఆడటం లేదనే చర్చ నడుస్తోంది. అప్పుడప్పుడు కొన్ని భారీ విజయాలు మినహా, గతంలో లాగా రెగ్యులర్ మ్యాజిక్ కనిపించడం లేదు. సంక్రాంతి సీజన్ తర్వాత సరైన పెద్ద సినిమాలు లేక కళ తప్పిన ఓవర్సీస్ బాక్సాఫీస్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకురావడానికి రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంతో జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ సినిమాపై ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం, నార్త్ అమెరికా(Peddi Overseas)లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 6 మిలియన్ డాలర్లుగా ఉంది. అలాగే టోటల్ ఓవర్సీస్ మార్కెట్లో ‘పెద్ది’ ముందు 9 మిలియన్ డాలర్ల భారీ లక్ష్యాన్ని ఉంచారు. కరోనాకు ముందుతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ మార్కెట్ సమీకరణాలు మారాయి. ‘కల్కి’ (18.57 మిలియన్లు), ‘ట్రిపుల్ ఆర్’ (15.34 మిలియన్లు), ‘పుష్ప 2’ (15.27 మిలియన్లు) లాంటి చిత్రాలు సంచలనాలు సృష్టించినా, మిగిలిన పెద్ద సినిమాల కలెక్షన్లలో స్థిరత్వం లోపించింది.
గత మూడేళ్లలో ‘సలార్’ (8.93 మిలియన్లు), ‘దేవర’ (6.08 మిలియన్లు), ‘ఓజి’ (5.60 మిలియన్లు), ‘హనుమాన్’ (5.31 మిలియన్లు) మాత్రమే చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించాయి. పెద్ద సినిమాలు ఏడాదికి ఒకటి రెండు మాత్రమే రావడం కూడా ఈ లిమిటెడ్ మార్కెట్‌కు ఒక కారణం. ఇలాంటి తరుణంలో వస్తున్న ‘పెద్ది’ చిత్రం ఇప్పటికే రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా గనుక అక్కడ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకుంటే, యుఎస్ మార్కెట్‌కు మళ్లీ కొత్త ఊపు రావడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి పెద్ది సినిమా ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుంది అనేది.
