Natu Kollu Farming
Natu Kollu Farming : సంక్రాంతి వచ్చిందంటే చాలు ప్రతి ఇంటా ముగ్గులు, గొబ్బిళ్లు ఎలాగో.. పందెం కోళ్లు కూడా అంతే. పందెం కోళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్నే ఆసరాగా చేసుకొని చాలామంది పందెం కోళ్ల ఉత్పత్తి చేస్తుంటారు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు పంజరంలో పందెం కోళ్లను పెంచుతూ.. అద్భుతమైన బిజినెస్ చేస్తున్నాడు..
Read Also : Drone Spraying : పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి
సొంతంగా వ్యాపారం చేయడంలో ఉండే సంతోషమే వేరు. అది చిన్నదైనా పెద్దదైనా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. దీన్నే అనుసరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా, రాజనగరం మండలం, శ్రీరాంపురం గ్రామానికి చెందిన యువకుడు అక్కిరెడ్డి వెంకట సంతోష్ కుమార్. రెండేళ్లుగా పందెం కోళ్లను ఉత్పత్తి చేస్తూ.. లాభాలను గడిస్తున్నారు.
4 లక్షల పెట్టుబడితో కోళ్ల పెంపకం :
యువరైతు సంతోష్ కుమార్ చదివింది బిటెక్. చేసేది సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. అయినా.. సొంతంగా ఏదో చేయాలనే తపనా.. అందరిలాగే ప్రతి సంక్రాతికి ఊరికి రావడం.. పందెం కోళ్లకు ఉన్న డిమాండ్ గమనించి.. తానే సొంతంగా పందెం కోళ్ల ఉత్పత్తి చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చనుకొని, రెండేళ్ల క్రితం 4 లక్షల పెట్టుబడితో జటాయు ఫామ్స్ పేరుతో పందెం కోళ్ల పెంపకం చేపట్టారు.
అయితే మొదటి అనుభవం లేక పెద్దగా కలిసి రాలేదు. ఈ ఏడాది డేగ, సేతువ, చావ్లా, రసంగి, కాకి లాంటి మేలుజాతి పుంజులను సేకరించి సొంతంగా పొదిగిస్తూ.. ఉత్పత్తి చేస్తున్నారు. సంక్రాంతి పండగకు అందుబాటులో ఉండే విధంగా సిద్ధం చేస్తున్నారు.
Read Also : Zero Budget Farming : జీరో బడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు