Drone Spraying : పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి

చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి.

Drone Spraying : పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి

Spraying Pesticides Drone

Drone Spraying : మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు సాగులో వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. సాగులో సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నారు. పొలాల్లో పురుగుమందులు చల్లేందుకు డ్రోన్లను వినియోగిస్తూ.. హైటెక్‌ సాగుకు బాటలు వేస్తున్నారు.

READ ALSO : Rabi Corps : రబీలో వేయదగిన పంటలు.. శాస్త్ర వేత్తల సూచనలు

డ్రోన్ల వినియోగంతో కూలీల కొరత తీరడంతోపాటు పురుగుమందులూ ఆదా అవుతున్నాయి. సమయం కూడా కలిసి వస్తుండడంతో డ్రోన్ల వినియోగంపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. పంట పోలాలలను  పురుగుల నుండి రక్షించుకునేందుకు ఈ డ్రోన్ లే  చాలా ఉపయోగపడుతున్నాయంటున్నారు.

READ ALSO : Vegetable Crops : వర్షాకాలంలో వేసుకోదగ్గ కూరగాయ పంటలు… చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు

సంప్రదాయ వ్యవసాయం నుంచి ఆధునిక సేద్యం వైపు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇప్పటికే కాడెద్దుల స్థానంలో ట్రాక్టర్లు వచ్చేశాయి. నాట్లు, కలుపుతో పాటు వరికోతల వరకు మెల్లమెల్లగా యాంత్రీకరణ అనివార్యమవుతున్న నేపథ్యంలో తాజాగా రసాయన పురుగు మందుల పిచికారీలో సైతం యాంత్రీకరణ జరుగుతోంది.

READ ALSO : Cotton Crop : పత్తిలో రసంపీల్చే పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఇప్పటికే చాలా ప్రాంతాల్లో డ్రోన్లను వినయోగించి పురుగుమందులను పిచికారి చేస్తున్నారు. డ్రోన్ల వినియోగంతో కూలీల సమస్యను అధిగమించడమే కాకుండా, పురుగుమందులపై పెట్టే ఖర్చు 40 శాతం వరకు ఆదా అవుతున్నాయి. సమయం కూడా కలిసి వస్తున్నది. దీంతో డ్రోన్ల వినియోగానికి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.

READ ALSO : Pest Control : పత్తిలో పెరిగిన తెగుళ్ల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ఈ నేపధ్యంలో ఏలూరు జిల్లా, నూజివీడు మండలం, రావిచెర్ల గ్రామానికి చెందిన రైతు కాప శ్రీనివాసరావు డ్రోన్‌తో తన 50 ఎకరాల పత్తి పైరుకు పురుగుమందులు పిచికారి చేయిస్తున్నారు.