Cotton Crop : పత్తిలో రసంపీల్చే పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో రైతులు పత్తితీతలు జరుపుతున్నారు. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలో వేసిన పత్తి కాయ ఎదుగుదల దశలో ఉంది.  ఈ దశలో రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఆశించి అధిక నష్టం చేస్తున్నాయి .

Cotton Crop : పత్తిలో రసంపీల్చే పురుగుల ఉధృతి.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు

Cotton Crop

Cotton Crop : ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పత్తి పైరు  వివిధ దశల్లో వుంది. తెలంగాణలో చాలా చోట్ల పత్తిని తీస్తుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కాయ పెరుగుదల దశలో కనిపిస్తోంది. ఈ సమయంలో పత్తిలో రసంపీల్చు పురుగుల తాకిడి ఎక్కువైనట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.  వీటి నివారణకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు గుంటూరు లామ్ ఫామ్  సీనియర్ శాస్త్రవేత్త డా. దుర్గా ప్రసాద్.

READ ALSO : Integrated Farming : పండ్లు, శ్రీగంధం, చేపల పెంపకంతో సమీకృత వ్యవసాయం

ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవటంతో పత్తి చేలు ఏపుగా  పెరిగాయి.  ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం  90 నుండి 120 రోజుల దశలో పత్తి ఉంది. ముందుగా విత్తుకున్న రైతుల పొలాల్లో రైతులు పత్తితీతలు జరుపుతున్నారు. ఇటు గుంటూరు కృష్ణా జిల్లాలో వేసిన పత్తి కాయ ఎదుగుదల దశలో ఉంది.  ఈ దశలో రసంపీల్చు పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ ఆశించి అధిక నష్టం చేస్తున్నాయి .

READ ALSO : Robot In Agriculture : వ్యవసాయంలోకి రోబో.. ఎకరంలో కలుపుతీత ఖర్చు రూ. 50

వీటి వల్ల మొక్కల పెరుగుదల తగ్గిపోయి, గిడసబారటంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతోంది. గులాబిరంగు పురుగు ఆశించే సమయం కూడా ఇదే కనుక, రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ వీటి  నివారణకు పాటించాల్సిన సమగ్ర యాజమాన్య చర్యల గురించి తెలియజేస్తున్నారు  గుంటూరు లామ్ ఫామ్ సీనియర్ శాస్త్రవేత్త డా. దుర్గా ప్రసాద్.

READ ALSO : Organic Vegetable Farming : వ్యవసాయం చేస్తూ.. రైతుబజార్లో.. కూరగాయలు అమ్ముతున్న యువజంట

పత్తికి రసంపీల్చే పుగులు ఆశిస్తే కనిపిస్తాయి. కానీ గులాబి రంగు పురుగు కనిపించదు. పంట నష్టం జరిగే వరకు  తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పురుగుపై ప్రతి రైతు నిఘా వుంచాలి.  పొలంలో లింగాకర్షక బుట్టలను అమర్చి, వీటిలో పడిన రెక్కల పురుగుల ఉధృతిని బట్టి నివారణ చర్యలు చేపట్టాలి.