Zero Budget Farming : జీరో బడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు

Zero Budget Farming : జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌లో రైతులకు అందుబాటులో ఉండే స‌హ‌జ‌సిద్ధ ప‌దార్థాలైన ఆవు మూత్రం, పేడతో త‌యారు చేసిన ఎరువుల‌ను మాత్రమే వాడుతుంటారు.

Zero Budget Farming : జీరో బడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు

paddy cultivation process in zero budget natural farming method

Updated On : December 4, 2023 / 3:46 PM IST

Zero Budget Farming : వ్య‌వ‌సాయంలో అధిక కూడా ఖ‌ర్చు చేయ‌కుండా.. పూర్తిగా సేంద్రీయ ప‌ద్ద‌తిలో చేసే వ్య‌వ‌సాయాన్నే జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్ అంటారు. అంటే ఇందులో విత్త‌నాల నుంచి పంట‌కు చ‌ల్లే ఎరువుల వ‌ర‌కు పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో వ్య‌వ‌సాయం సాగుతుంది. దీని వల్ల దిగుబడి తక్కువగా వచ్చినా.. పెట్టుబడి ఖర్చులు పూర్తిగా తగ్గిపోవడంవల్ల లాభాలు అధికంగా ఉంటాయి. దీన్నే పాటిస్తూ.. దేశీ వరి రకాన్ని సాగుచేస్తూ.. సత్ఫలితాలను పొందుతున్నారు ఏలూరు జిల్లాకు చెందిన ఓ రైతు జంట.

Read Also : Drone Spraying : పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి

మ‌న దేశంలో ప్ర‌స్తుతం చాలా మంది రైతులు కృత్రిమ ఎరువులు, ర‌సాయ‌నాలు వాండి పంట‌ల‌ను పండిస్తున్నారు. అవి ఉప‌యోగించకుండా పూర్తిగా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను సాగు చేసే వారు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అయితే నిజానికి కృత్రిమ ఎరువుల‌ను వాడ‌డం క‌న్నా సేంద్రీయ ప‌ద్ధ‌తిలో పంట‌ల‌ను పండిస్తే.. ఖర్చు తగ్గడమే కాకుండా.. దిగుబ‌డి కూడా ఎక్కువ‌గా వస్తుంది. దీనికి తోడు పంట‌ల‌ను పండించే భూమి ఎన్నేళ్ల‌యినా సారం కోల్పోకుండా ఉంటుంది.

అలాగే సేంద్రీయ పంట‌ల‌ను తింటే మ‌న ఆరోగ్యానికి కూడా న‌ష్టం వాటిల్ల‌కుండా ఉంటుంది. ఇటీవలే చాలా మంది రైతుల్లో.. సేంద్రీయ ప‌ద్ధ‌తిపై అవ‌గాహ‌న పెరిగింది. సాగు విధానాలను ఆచరిస్తున్నారు. మరి కొందరైతే దేశీ రకాలను సాగుచేస్తూ.. పూర్తిగా జీరోబడ్జెన్ సాగు విధానం చేపడుతున్నారు. ఈ కోవలోనే ఏలూరు జిల్లా, ద్వారాక తిరుమల మండలం, దొరసాని పాడుకు చెందిన ఓ యువజంట జీరోబడ్జెట్ సాగు విధానంలో దేశీ వరి రకాలను సాగుచేస్తూ.. మంచి ఫలితాలను సాధిస్తున్నారు.

జీరో బ‌డ్జెట్ ఫార్మింగ్‌లో రైతులకు అందుబాటులో ఉండే స‌హ‌జ‌సిద్ధ ప‌దార్థాలైన ఆవు మూత్రం, పేడతో త‌యారు చేసిన ఎరువుల‌ను మాత్రమే వాడుతుంటారు. భూసారం పెరిగేందుకు పిఎండిఎస్ పద్ధతిలో నవధాన్యాలను సాగుచేసి.. వాటిని పొలంలో కలియదున్నడం.. తరువాత ప్రధాన పంటలను సాగుచేస్తుంటారు. దీంతో పెద్దగా ఖర్చు ఉండదని రైతులు చెబుతున్నారు.

Read Also : Reproduction Techniques : గేదెల పునరుత్పత్తిలో.. మెళకువులు