Fish Feed Prices : పెరిగిన ఫీడ్ ధరలు.. తగ్గిన చేపల ధరలు

Fish Feed Prices : మరోవైపు ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెరగడంతో పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితేలే నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు.

Fish Feed Prices : పెరిగిన ఫీడ్ ధరలు.. తగ్గిన చేపల ధరలు

Fall In Fish Prices Due To Increase Feed Price

Fish Feed Prices : ఆక్వా రైతులు నష్టాలతో సతమతమవుతున్నారు. చేపల ధర రోజురోజుకు తగ్గిపోవడంతో ఆక్వా సాగు పతనావస్థకు చేరుతోంది. ఆక్వా సాగులో రొయ్యల సాగు చేసినా వైరస్‌లు, ఈహెచ్‌పీ, సెల్‌లూజ్‌లు, విబ్రియో పేరుతో నష్టపోతున్న ఆక్వారైతు రొయ్యల సాగు వదలేసి చేపలు పెంచుతుంటే, నీటికాలుష్యంతో పలు రాకాల వ్యాధులు ఆశించడం.. మరోవైపు ఫీడ్ ధరలు కూడా విపరీతంగా పెరగడంతో పెట్టుబడి ఖర్చులు రాని పరిస్థితేలే నెలకొన్నాయని రైతులు వాపోతున్నారు.

Read Also : Green Gram Cultivation : వేసవి పెసరసాగులో మెళకువలు.. అధిక దిగుబడులకు మేలైన యాజమాన్యం

ఫీడ్‌ ధరలు ఆకాశాన్నంటడంతో ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా కల్చర్‌ సాగు అయోమయంలో పడిపోయింది. దీంతో సిరులు పండించిన తెల్ల చేప ఇప్పుడు నష్టాల ఊబిలోకి నెడుతుంది. చేపల మేత డీవోబి తవుడు మార్కెట్‌లో పది కిలోలకు రూ. 220 పలుకుతోంది. కొన్ని నెలల వ్యవధిలోనే అమాంతంగా  పెరిగిపోయింది.

ప్రస్తుతం తెల్ల చేపల ధర కిలో రూ. 110 లకు కొనుగోలు చేస్తున్నారు. మేతల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం, దుంపగడప గ్రామ రైతులు బెంబేలెత్తుతున్నారు. చేప కిలో పెరగాలంటే ప్రస్తుతం రూ.20 అదనంగా ఖర్చు అవుతోంది. మార్కెట్‌లో చేపల ధర మాత్రం పెరగడం లేదని, ఖర్చుకు తగ్గట్లు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం మేతకు పెరిగిన ధరలతో నష్టాలు చవిచూడాల్సిందేనని రైతులు అంటున్నారు.

ఒకప్పడు రైతులకు ఆర్థిక భరోసాను ఇచ్చిన ఆక్వా సాగు నేడు నష్టాల దిశగా పయనిస్తోంది. చేపలు, రొయ్యల సాగు లాభాల దిశగా సాగినప్పుడు ప్రభుత్వానికి ఎన్నో కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్య రూపంలో ఆదాయం సమకూరింది. నేడు నష్టాలు ఎదురయ్యే సమయంలో ప్రభుత్వం రైతులకు అండగా నిలబడాలని రైతులు కోరుతున్నారు.

Read Also : Paddy Cultivation : వరిలో అగ్గి తెగుళ్ల ఉధృతి – నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు