Making Honey Products : తేనె ఉత్పత్తుల తయారీ శిక్షణ ఇస్తున్న రైతు

Making Honey Products : వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అతి తక్కువ ఖర్చుతో, అటు వ్యవసాయానికి, ఇటు రైతుకు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధినిచ్చే రంగంగా తేనెటీగల పెంపకం మారింది.

Making Honey Products : తేనె ఉత్పత్తుల తయారీ శిక్షణ ఇస్తున్న రైతు

Farmer Giving Training In Making Honey Products

Updated On : November 3, 2024 / 2:19 PM IST

Making Honey Products : స్వయం ఉపాధి పరిశ్రమగా తేనెటీగల పెంపకం, గ్రామీణులకు, నిరుద్యోగ యువతకు మారింది. ఇప్పటివరకు ఈ పరిశ్రమలో రైతుకు ఒక్క తేనె మాత్రమే ప్రధాన ఆదాయ వనరు. అయితే అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల తేనె పరిశ్రమ నుండి అనేక ఉప ఉత్పత్తుల ద్వారా రైతులు ఆదాయం పొందేవీలుండటంతో కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు… ఇదే బాటలో నడుస్తున్నాడు. తేనె ఉత్పత్తులతో పాటు.. తేనెటీగల ఉత్పత్తి చేపడుతూ.. అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో అతి తక్కువ ఖర్చుతో, అటు వ్యవసాయానికి, ఇటు రైతుకు, నిరుద్యోగ యువతకు చక్కటి ఉపాధినిచ్చే రంగంగా తేనెటీగల పెంపకం మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల కింద రాయితీలు, రుణ సౌకర్యం కల్పిస్తుండటంతో చాలామంది గ్రామీణులు, నిరుద్యోగ యువత ఈ పరిశ్రమలో ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు.

దీనికితోడు తేనె వినియోగం విస్తృతమవటం,  మార్కెట్ గిరాకీ నానాటికీ పెరుగుతుండటం వల్ల ఆర్ధిక ఫలితాలు ఆశాజనకంగా వున్నాయి. ఈ నేపధ్యంలో తేనె పరిశ్రమను ఉపాధిగా మలుచుకుని ముందుకు సాగుతున్నారు కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలి, పొట్టిపాడు గ్రామానికి చెందిన రైతు బోయపాటి అశోక్.

తేనెటీగల పెంపకం సంచార పరిశ్రమ. పంటల పూత దశ ఎక్కడ వుంటే అక్కడకు పెట్టెలను తరలించాలి. రాణీఈగ గుడ్లు పెట్టే సామర్థ్యం, కూలీ ఈగలు సేకరించే మకరందం పైనే తేనె ఉత్పత్తి ఆధారపడి వుంటుంది. ప్రస్థుతం తేనె మాత్రమే రైతుకు ప్రధాన ఆర్థిక వనరుగా వుంది. కానీ ఈ పరిశ్రమలో అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉప ఉత్పత్తులను తయారు చేస్తున్నారు రైతు అశోక్. ప్రధానంగా తేనెటీగల ఉత్పత్తితో పాటు.. మైనం, పుప్పొడి, జెల్లీస్, వెల్లుల్లితేనే, జింజర్ తేనే, హానీరోజ్ ఇలా అనేక ఉత్పత్తులను తయారుచేసి అమ్ముతూ.. అధిక లాభాలు ఆర్జిస్తున్నారు.

రైతు అశోక్ 30 ఏళ్లుగా తేనెటీగల పరిశ్రమలో ఉన్నారు. అయితే ఈ రంగం పట్ల ఆసక్తి ఉన్న వారికి నెలలో ఒకరోజు ఉచితంగా శిక్షణ కూడా ఇస్తున్నారు. తేనెటీగల ఉత్పత్తి, తేనె సేకరణ, ఉపఉత్పత్తుల తయారీ విధానంతో పాటు మార్కెటింగ్ మెళకువల పట్ల అవగాహన కల్పిస్తున్నారు.

Read Also : Crops In ATM System : 70 సెంట్లలో 26 రకాల పంటల సాగు.. ఏటీఎం విధానంలో ఏడాది పొడవునా దిగుబడులు