Orchards Subsidies : పండ్లతోటలకు సబ్సిడీలు కావాలంటున్న రైతులు

ప్రస్తుతం జామసాగు విస్తీర్ణం పెరిగిపోవడంతో మార్కెట్ సమస్య ఎదురవుతుందని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.

Orchards Subsidies : పండ్లతోటలకు సబ్సిడీలు కావాలంటున్న రైతులు

Farmers Want Subsidies for Orchards

Updated On : May 29, 2024 / 2:18 PM IST

Orchards Subsidies : రోజురోజుకూ వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంభిస్తున్న రైతులు పంటల సాగు, ఎంపికలోనూ కొత్త విధానాలు పాటిస్తున్నారు. సంప్రదాయ పంటల స్థానంలో ఉద్యానవన పంటైన జామ తోటపై దృష్టి సారిస్తున్నారు. పాత పంటలతో పోలిస్తే దీటిపై కచ్చితంగా దిగుబడితో పాటు రాబడి కూడా ఎక్కువగా ఉండడమే రైతులు వీటిపై మొగ్గు చూపేలా చేస్తోంది. అయితే ప్రస్తుతం జామసాగు విస్తీర్ణం పెరిగిపోవడంతో మార్కెట్ సమస్య ఎదురవుతుందని విజయనగరం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు.

మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం భారంగా మారుతుంది. ముఖ్యంగా సంప్రదాయ పంటలు సాగుచేసే రైతులకు పంట చేతికొచ్చే వరకు నమ్మకం ఉండటం లేదు. ఈ నేపధ్యంలో చాలా మంది రైతులు నిర్ధిష్టమైన ఆదాయం వచ్చే పంటల సాగును ఎంచుకుంటున్నారు. ఇందులో ముఖ్యమైనవి పండ్లతోటలు. ఇటీవల కాలంలో జామపండ్లకు విపరీతమైన గిరాకీ పెరగడం.. అందుకు అనుగుణంగానే హైబ్రీడ్ రకాలు రావడం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు నాటి అధిక దిగబడిని తీసే పద్ధతులు రావడంతో రైతులకు లాభాల పంటగా మారిపోయింది.

ఈ కోవలోనే విజయనగరం జిల్లా, కొమరాడ మండలంలో చాలా మంది రైతులు జామతోటల పెంపకం చేపట్టారు. కొందరు ఏకపంటగా సాగుచేస్తే… మరి కొందరు అంతర పంటగా జామను సాగుచేశారు. అయితే .. మొదట్లో లాభాలు భాగానే ఉన్నా, రాను రాను విస్తీర్ణం పెరిగి పండ్ల ఉత్పత్తి పెరిగింది. దీంతో రైతులకు మార్కెట్ సమస్య ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి మార్కెట్ అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బంల – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు