Ganoderma Pest : కొబ్బరిని ఆశించే గానోడెర్మా తెగులు, నివారణ చర్యలు !

కొత్త మొక్కలను తిరిగి నాటేటప్పుడు చెత్త వేసి కాల్చిన గోతుల్లో బాగా చివికిన పశువుల ఎరువు, కంపోస్టు ఎరువులతో పాటు 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 1 కిలో వేపపిండి మ్మిశమంలో నింపి మొక్కను నాటవలయును. గానోడెర్మా తెగులు కలిగించే శిలీరధ్ర బీజాలు నేలలో ఉండి తెగిన లేక దెబ్బతిన్న వేర్ల ద్వారా చెట్లకు వ్యాపిస్తుంది.

Ganoderma Pest : కొబ్బరిని ఆశించే గానోడెర్మా తెగులు, నివారణ చర్యలు !

Management of Basal Stem Rot (Ganoderma Wilt) in Coconut

Updated On : January 7, 2023 / 12:46 PM IST

Ganoderma Pest : కొబ్బరి తోటలను ఆశించే తెగుళ్ళలో గానోడెర్మా తెగులు ముఖ్యమైనది. చాలా ప్రమాదకరమైనది. దీన్ని సిగతెగులు,ఎర్రలక్క తెగులు, బంకకారు తెగులు, పొట్టులక్క తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు నల్ల నేలలు కంటే తేలిక నేలల్లో వేసే కొబ్బరితోటల్లో ఎక్కువగా కనబడుతుంది. వ్యాప్తి కూడా తేలిక నేలల్లో ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం ఎక్కువగా ఉంటే వ్యాధి వ్యాప్తి తక్కువగా ఉంటుంది. ఈ తెగులు తీవ్రత మరియు తెగులు వ్యాప్తి నీటి ఎద్దడి అధికంగా ఉండే తోటల్లో ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా రైతులు, కొబ్బరి చెట్ల వేర్లను నరికి వేయడం చేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. కొబ్బరి వేర్లు నరికి వేయడం వల్ల వేర్లకు గాయం ఏర్పడి నేలలో ఉండే గానోడెర్మా తెగులు కలుగచేసే శిలీంధ్ర బీజాలు గాయమైన వేర్ల ద్వారా చెట్లను ఆశించడం జరుగుతుంది.

గానో డెర్మా తెగులు లక్షణాలు :

గానోడెర్మా తెగులు నేలలో ఉండి బూజు జాతి శిలీంధ్ర బీజాల వల్ల కొబ్బరికి సోకుతుంది. గానోడెర్మా తెగులు త్మీవత భూమిలో నుండే వేర్లను ఆశించును. ఈ దశలో తెగులును గమనించకపోవచ్చు. అధిక శాతం వేర్లు కుళ్ళిన తరువాత కాండంలోకివ్యాపించి కణాలు పూర్తిగా కుళ్ళేలా చేస్తుంది. అయితే ఈ కుళ్ళు భూమిలోను, కాండంలోనూ అంతర్గతమవడం వల్ల బయటకు కనిపించదు.ఈ దశలో కాండం మొదలు చుట్టూ ఉన్న చిన్న చిన్న పగుళ్ళ నుండి ముదురు గోధుమ రంగు నుండి తెలుపు వర్ణం కలిగిన చిక్కటి జిగురు వంటి ద్రవం కారడం గమనించవచ్చు. కాండంలోని కణ సముదాయం పూర్తిగా కుళ్ళిపోవడం వల్ల చెట్టు అవసరమైన నీరు, పోషక లవణాలను భూమి నుండి తీసుకోలేకపోతుంది. ఈ దశలో కాండం మొదలు చుట్టూ ముందుగా చిన్న చిన్న పగుళ్ళ ద్వారా జిగురు కారుతుంది.

ఈ బంక కారుట క్రమేణా పైకి వ్యావించును. తెగులు సోకిన చెట్ల ఆకులు పసువు వర్జానికి మారి వడలిపోయి గోధుమ వర్డానికి మారతాయి. కొత్త అకులు ఆలస్యంగా రావడం వల్ల తెగులు సోకిన చెట్టుపై అకుల సంఖ్య తక్కువగా ఉండడం గమనించవచ్చు. అదే విధంగా ఆకుపరిమాణం కూడా తగ్గిపోతుంది. తెగులు సోకిన కొబ్బరి మొక్కల్లో పుష్పాల నంఖ్య బాగా
తగ్గిపోవడమే కాకుండా మగ పుష్పాల సంఖ్య పెరిగి ఆడపుష్పాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. పిందెలు, కాయలు రాలడం కూడా ఈ తెగులు యొక్క లక్షణము. ఈ తెగులు ఆశించిన కొబ్బరి చెట్టు వేర్లను గమనించినట్లయితే పూర్తిగా కుళ్ళిపోయి నలువురంగులో మారడం చూడవచ్చు. తెగులు త్మీవతగా ఉన్న చెట్లలో సుమారు 70 శాతం వేర్లు కుళ్ళిపోయి ఉంటాయి. కొత్త వేర్లు పుట్టవు.

ఏ మాత్రం అశ్రద్ద చేసినా తెగులు తీవ్రమై చెట్టు ఆకులు పసుపు వర్ణంలోకి మారి వడలి వేలాడిపోయే దశకు చేరును. తరువాత మొవ్వు భాగం మొత్తం వడలిపోయి చెట్టు ఎండిపోతుంది.
కొబ్బరి ఆకులు పూర్తిగా రాలిపోవడం వల్ల కాండం మొండిగా తయారై చెక్కిన పెన్సిల్‌ మొన మాదిరిగా కనిపిస్తుంది. తరువాత 5, 6 నెలల్లో చెట్టు చనిపోతుంది. తెగులు సోకి చివరి దశలో ఉన్న చెట్ల మొదళ్ళపై పుట్టగొడుగులు మొలుస్తాయి. ఈ గానోడెర్మా తెగులను పుట్టగొడుగులు ఏర్పడే వరకు రానివ్వడం అత్యధిక ప్రమాదకరం. బలమైన గాలులు వీచేటవ్వుడు ఈ గానోడెర్మా తెగులు సోకి చనిపోయిన చెట్టు, అడుగుభాగంలో విరిగి పడిపోవడం కొబ్బరితోటల్లో గమనించవచ్చు. ఈ పడిపోయిన కొబ్బరి దుంగలను గమనించినప్పుడు దుంగ లోపలి
భాగం కుళ్ళిపోయి గుల్లమాదిరిగా ఉంటుంది.

తోటలో గానోడెర్మా తెగులు లక్షణాలు గమనించిన వెంటనే తెగులు ఉన్న ప్రాంతాన్ని ఒక మీటరు లోతు, 50 సెం.మీ. వెడల్పు గల గోతిని తవ్వి తెగులు సోకిన చెట్ల నుండి వేరు చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తెగులు సోకిన చెట్ల వేర్ల వద్ద ఉన్న తెగులు కలుగచేసే శిలీంధ్ర బీజాలు ఆరోగ్యవంతమైన చెట్టు దగ్గరికి వెళ్ళవు.

నివారణ చర్యలు ;

తోటలో చనిపోయిన మరియు తెగులు ఎక్కువగా సోకిన చెట్లను వేర్లతో సహా పెకలించి తగులబెట్టాలి. లేనిచో చనిపోయిన చెట్ల కాండంపై పుట్టగొడుగులు మొలిచి తెగులు వ్యాప్తిని నిరోధించుట కష్టమవుతుంది.

కొత్త మొక్కలను తిరిగి నాటేటప్పుడు చెత్త వేసి కాల్చిన గోతుల్లో బాగా చివికిన పశువుల ఎరువు, కంపోస్టు ఎరువులతో పాటు 50 గ్రా. ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంద్రపు పొడిని 1 కిలో
వేపపిండి మ్మిశమంలో నింపి మొక్కను నాటవలయును. గానోడెర్మా తెగులు కలిగించే శిలీరధ్ర బీజాలు నేలలో ఉండి తెగిన లేక దెబ్బతిన్న వేర్ల ద్వారా చెట్లకు వ్యాపిస్తుంది. కనుక
కొబ్బరి చెట్ల వేర్లు నరుకుట, వేర్లు తెగునంత వరకు లోతుగ దుక్కి చేయుట పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోను చెట్ల వేర్లు నరకరాదు.

ఈ తెగులు ఎక్కువగా తేలిక నేలల్లో వస్తుంది. అందువల్ల ఈ తేలిక నేలల్లో జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట పంటలు చిక్కగ పెంచి వూతకు వచ్చే దశలో భూమిలో కలియదున్నాలి. చెట్ల మొదలు చుట్టూ రెండు మీటర్ల వ్యాసార్ధం గల వళ్ళాలు చేసి, బోదెల ద్వారా వ్రతి చెట్టుకు విడివిడిగా నీరు పెట్టాలి.