High Yield Rice Crops : అధిక దిగుబడినిచ్చే దొడ్డుగింజ వరి రకాలు

తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది.  ఈ ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు . ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది.

High Yield Rice Crops : అధిక దిగుబడినిచ్చే దొడ్డుగింజ వరి రకాలు

High Yield Rice Crops

Updated On : June 18, 2023 / 12:55 PM IST

High Yield Rice Crops : ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే వేసవి దుక్కులు చేసుకున్న రైతులు విత్తనాల సేకరణలో నిమగ్నమయ్యారు. అయితే బోరు, బావుల కింద వరిని సాగుచేసే వారు చాలా వరకు స్వల్పకాలిక రకాలనే సాగుచేస్తుంటారు.  ముఖ్యంగా  దొడ్డుగింజ రకాలను సాగుచేసే రైతులు ఏ రకం ఎన్నుకోవాలి.. ఎప్పుడు నార్లు పోసుకోవాలి.. ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర్ రాజు.

READ ALSO : Cashew Manufacturing : కుటీర పరిశ్రమగా జీడిపప్పు తయారీ.. సంప్రదాయ పద్దతిలోనే పప్పు తయారీ చేస్తున్న వ్యాపారులు

తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది.  ఈ ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు . ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది. వాతావరణ మార్పుల కారణంగా ప్రతి ఏటా పంట చేతికొచ్చే సమయంలో అధిక వర్షాలతో తీవ్రనష్టాలు వాటిల్లుతోంది.

READ ALSO : Arable Land : సాగుకు యోగ్యంగా చౌడుభూముల పునరుద్ధరణ.. సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపడితే సత్ఫలితాలు

ఈ నేపధ్యంలో మధ్య, స్వల్పకాలిక రకాలను సాగుచేయాలని ఇటు ప్రభుత్వం, అటు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు దొడ్డుగింజ రకాలను సాగుచేసేందుకు మొగ్గుచూపుతున్నారు. కానీ ఏరకాలు వేసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. అంలాంటి వారికోసం ఖరీఫ్ కు అనువైన దొడ్డుగింజ రకాలు వాటి గుణగణాలేంటో తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. దామోదర్ రాజు.