Paddy Stem Borer
Paddy Stem Borer : పెరుగుదల దశలో వున్న రబీ వరిలో ప్రస్థుతం పురుగుల తాకిడి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మొగి పురుగుల బెడద, రైతుకు ఏటా సర్వసాధారణంగా మారింది. వీటి ఉధృతి వల్ల 10 నుంచి 30 శాతం దిగుబడికి నష్టం వాటిల్లే ప్రమాదం వుంది. నివారణకు పురుగుమందులు పిచికారి ఒక్కటే పరిష్కారం కాదు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను ఆచరించి తక్కువ ఖర్చుతో వీటిని సులభంగా అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్.
Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం
తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లోను ప్రధాన పంట వరి. నాటు నుంచి కోత దశ వరకు, కూలీల కొరత, సాగునీటి ఇబ్బందులతో అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతుకు చీడపీడల నివారణ కూడా పెద్ద సవాలుగా మారింది. దీనికి ప్రధానంగా యాజమాన్య లోపాలు ఒక కారణమైతే.. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఈ చీడపీడల ఉధృతికి దోహదపడుతున్నాయి.
వరిసాగయ్యే అన్నిప్రాంతాల్లోను మొగి పురుగు దాడి సర్వసాధారణంగా మారిపోయింది. ఇది నారుమడి దశ నుంచి పైరు కంకివేసే దశ వరకు ఏ సమయంలో అయినా ఆశించి నష్టం కలుగజేస్తుంది. వివిధ ప్రాంతాల్లో పిలక దశ నుండి దుబ్బుచేసే దశవరకు వరి ఉంది.
ఆలస్యమైన ప్రాంతాల్లో అక్కడక్కడ ఇంకా నాట్లు వేస్తున్నారు. అయితే ఈ సమయంలో మొగిపురుగును ముందస్తుగా అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రవణ్ కుమార్. యాసంగి వరిలో అధికంగా ఆశించే మొగిపురుగు పూతదశలో కనుగ ఆశించినట్లైతే తెల్లకంకులు ఏర్పడే అవకాశం ఉంది. దీనిని గుర్తించిన వెంటేనే నివారించకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. దీని నివారణకు ఎలాంటి రసాయన మందులు పిచికారి చేసి అరికట్టాలో ఇప్పుడు చూద్దాం..
Read Also : Summer Green Gram : వేసవి పెసర, మినుము సాగు – యాజమాన్యం