Summer Green Gram : వేసవి పెసర, మినుము సాగు – యాజమాన్యం

Summer Green Gram : ప్రస్థుతం వేసవి పంటగా పెసర, మినుము సాగుచేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి.. ఎప్పుడు విత్తుకోవాలి.. ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం.. 

Summer Green Gram : వేసవి పెసర, మినుము సాగు – యాజమాన్యం

summer green gram and management techniques

Summer Green Gram : తక్కువ పెట్టుబడులతో, స్వల్పకాలంలో అందివచ్చే అపరాలసాగు రైతుకు అన్ని విధాలా కలిసివస్తోంది. సాగు మొదటి నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని,  సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 5 నుండి 7 క్వింటాళ్ళ వరకు దిగుబడులు పొందవచ్చు. ప్రస్థుతం వేసవి పంటగా పెసర, మినుము సాగుచేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి.. ఎప్పుడు విత్తుకోవాలి.. ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

Read Also : Agriculture with Mulching : మల్చింగ్ తో ఆధునిక వ్యవసాయం

మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ, అంత కన్నా ఎక్కువ స్థాయిలో పప్పుధాన్యాల వినియోగం ఉంది. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడవల్సివస్తోంది. మార్కెట్ లో కూడా మద్ధతు ధర కంటే అధిక రేటు పలుకుతుండటంతో.. నీటి వసతి ఉన్న రైతాంగం ప్రస్థుతం వేసవి పంటగా మినుము, పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపికచేసుకొని సాళ్ల మధ్య దూరం పాటిస్తూ.. విత్తుకోవాలని పెసర, మినుము పంటల్లో మేలైన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, శాస్త్రవేత్త సంధ్యాకిషోర్.

రకాల ఎంపిక ఎంత ముఖ్యమో… యాజమాన్య పద్ధతులు కూడా అంతే ముఖ్యం. అపరాల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలంగా వుంటాయి. కానీ చౌడునేలలు, మురుగునీరు నిలిచే భూములు పనికిరావు. అపరాల పంటల తొలిదశలో కలుపు నివారణ చర్యలు చేపడితే మొక్కలు ఆరోగ్యంగా పెరిగి , అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మొక్కదశ నుండి పూత, కాయదశలో అధికంగా చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్ట పరుస్తుంటాయి. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ.. సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

Read Also : Kisan Agri Show : హైదరాబాద్ హైటెక్స్‌లో కిసాన్ 2024 అగ్రి షో