Cultivation Of Curry Leaves : ఒకసారి నాటితే 15 ఏళ్లపాటు దిగుబడి! కరివేపాకు సాగుతో లభాలు గడిస్తున్న రైతులు

కరివేపాకులో గొంగళి పురుగులు ఆకులను తిని నష్టపరుస్తాయి. నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలుసు పురుగులు కాండం పై చేరి రసాన్ని పిల్చి వేస్తాయి.

Cultivation Of Curry Leaves : ఒకసారి నాటితే 15 ఏళ్లపాటు దిగుబడి! కరివేపాకు సాగుతో లభాలు గడిస్తున్న రైతులు

Cultivation Of Curry Leaves :

Updated On : December 12, 2022 / 6:26 PM IST

Cultivation Of Curry Leaves : ఒకసారి కరివేపాకు విత్తనం నేలలో నాటితే.. మొక్కల నుంచి 15 ఏళ్ల పాటు దిగుబడి తీసుకోవచ్చు. దిగుబడికి తోడు మంచి ధర కూడా పలికితే మంచి అదాయం చేతిక వస్తుంది. కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కరివేపాకు సాగు చేపట్టవచ్చు. కరివేపాకును నీటి పారుదల కింద, నీరు లేనప్పుడు మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా సాగు చేయవచ్చు. ఇది బహు వార్షిక కూరగాయ పంట.

సాగుకు అనువైన నేలలు ; నీరు నిలవని తేలికపాటి గరప నేలలు అనుకూలం. నీరు నిలిచే నల్లరేగడి భూములు సాగుకు పనికిరావు. మురుగు నీటి పారుదల వసతిగల ఎర్ర గరప నేలలు, ఒండ్రు నేలలు మంచివి. నీరు ఎక్కువయితే తట్టుకోలేదు. ఖరీఫ్ జూలై – ఆగస్టూ లో విత్తుతారు.

విత్తు విత్తే విధానం ; కరివేపాకు ముఖ్యంగా విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఎక్కువ దిగుబడి గల మొక్కల నుండి బాగా పండిన పండ్లను సేకరించి వాటిని నారు మొలకల ఉత్పాత్తికి ఉపయోగించాలి. ఈ విత్తనాలను నర్సరీ నందు కానీ లేక పాలిబ్యాగుల్లో 1:1:1 నిష్పత్తిలో ఇసుక, మట్టి , పశువుల ఎరువు నింపి విత్తుకోవాలి. ఎకరానికి 80 నుండి100 కిలోల విత్తనాలు సరిపోతాయి. నారుమడులు తయారు చేసి వరుసల్లో 10 సెం. మీ. ఎండంతో విత్తనాలను విత్తుకోవాలి. గడ్డి కప్పి రోజుకు రెండుసార్లు నీటిని చల్లుకోవాలి. పెద్ద మొక్కల చుట్టూ ఉన్న చిన్న మొక్కల్ని వేర్లతో జాగ్రత్తగా తీసి వర్షాకాలంలో వెంటనే మరల నాటడం వలన కూడా కరివేపాకు వ్యాప్తి చెందుతుంది.

మొదటగా నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45*45*45 సెం.మీ. గుంతలను 1;1 మీ. దూరంలో తీయాలి. ఒక హెక్టారుకు పదివేల మొక్కలు అవసరం అవుతాయి. పశువుల ఎరువు ప్రతి గుంతకు 10 కిలోల చొప్పున వేయాలి.

ఎరువులు ; అధిక దిగుబడులు కోసం హెక్టారుకు 25 టన్నుల పశువుల ఎరువు, 60:10:10 కిలోల నిష్పిత్తిలో నత్రజని : భాస్వరం : పోటాష్ వేయాలి. సగ భాగం నత్రజని, మొత్తం భాగం భాస్వరం, పోటాష్ జూన్ మాసంలో వేయాలి. మిగతా సగం నత్రజని ఆరు మాసాల తర్వాత వేయాలి. ఈ ఎరువులు వర్షాకాలంలో వేసుకోవాలి. మొక్కలు నాటిన వెంటనే బోదెల ద్వారా నీరు పెట్టాలి. వర్షం పడని సమయంలో వారానికి ఒకసారి నీరు పెట్టాలి.

సస్యరక్షణ చర్యలు: కరివేపాకులో గొంగళి పురుగులు ఆకులను తిని నష్టపరుస్తాయి. నివారణకు మలాధియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పొలుసు పురుగులు కాండం పై చేరి రసాన్ని పిల్చి వేస్తాయి. మొక్క పెరుగుదల తగ్గిపోతుంది. నివారణకు డైమిధోయేట్ 2 మి. లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. పిచికారి చేసిన తర్వాత 10 రోజుల వ్యవధి ఇచ్చి అకుకోయాలి. అకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రా. కార్బొండిజమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పంట దిగుబడి ; విత్తనాలు విత్తిన 9-10 నెలలకు పంట కోతకు వస్తుంది. అయితే మొదటి కోతలో కరివేపాకు దిగుబడి, ఆదాయం చాలా తక్కువగా ఉంటాయి. ఎకరానికి 800 నుంచి వెయ్యి కిలోల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రతి మూడు నాలుగు నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. రెండో సంవత్సరంలో ఎకరానికి రెండు వేల నుంచి మూడు వేల కిలోల దిగుబడి వస్తుంది. అనంతరం ప్రతి కోతకు దిగుబడి పెరుగుతూ ఉంటుంది. మూడో సంవత్సరంలో ఎకరానికి 8-10 టన్నుల దిగుబడి పొందే అవకాశం ఉంది.