Paddy Varieties : ప్రకృతి విధానంలో దేశీ వరిరకాల సాగు – సొంతంగా వరి పండించుకుంటున్న రైతు  

Paddy Varieties : ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... తరచూ అనారోగ్యానికి గురవుతున్నా కుటుంబసభ్యులను చూసి పరిష్కారం దిశగా అడుగులు వేశారు

Paddy Varieties : ప్రకృతి విధానంలో దేశీ వరిరకాల సాగు – సొంతంగా వరి పండించుకుంటున్న రైతు  

Organic Desi Paddy Varieties Farming

Updated On : November 27, 2024 / 2:36 PM IST

Paddy Varieties : రత్న చోడి, ముడి మురంగి,  మైసూర్‌ మల్లిక, ఇల్లపు సాయి, నవారా, కాలాబట్టి.. ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా.. దేశీ వరి వంగడాలు.. ఇవి హైబ్రిడ్‌ వరి  వంగడాల్లా కాదు ఎన్నో ఔషధ గుణాలున్న దేశీ రకాలు. వీటిని ఇప్పుడు ఎలాంటి రసాయనాలు లేకుండా సేంద్రియ పద్దతిలో సాగు చేస్తున్నారు  పశ్చిమ జిల్లాకు చెందిన ఓ రైతు. అర ఎకరంలో రెండేళ్లుగా అనేక రకాల దేశీ వరి వంగడాలను సాగు చేసి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆహారం విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. తరచూ అనారోగ్యానికి గురవుతున్నా కుటుంబసభ్యులను చూసి పరిష్కారం దిశగా అడుగులు వేశారు పశ్చిమగోదావరి జిల్లా, పాలకొల్లు మండలం, దగ్గులూరు గ్రామానికి చెందిన రైతు కోరం ఏడుకొండలు. సేంద్రీయ వ్యవసాయంతోనే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టగలమని గ్రహించారు.

ఇందుకోసం మనం తినే తిండిని మనమే పండించుకోవాలని నిర్ణయించుకుని..  అర ఎకరం పొలంలో రెండేళ్లుగా సేంద్రియ విధానంలో దేశీ వరి రకాలను సాగుచేస్తున్నారు. దేశీయ వంగడాల ద్వారా పండించిన ఈ బియ్యం మనిషికి మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుంది.

ఆరోగ్యం అందించేందుకు ఎంతో తోడ్పడతాయి. పిల్లలకు అధిక పోషక విలువలు, మంచి ప్రొటీన్స్‌ను కలిగి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. వీటిని సాగు చేయడం ద్వారా భూసారం దెబ్బతినకుండా ఉంటుందని రైతు చెబుతున్నారు.

Read Also : Chilli Cultivation : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన మిరప కోతలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు