Chilli Crop : మిరపలో గడ్డిజాతికి చెందిన కలుపు నివారణలో చేపట్టాల్సిన యాజమాన్యం
మిరప సాళ్ళ మధ్య, సాళ్ళలో మొక్కల మధ్య దూరం అధికం కాబట్టి గొర్రు, గుంటకలతో సేద్యం చేయటానికి అవకాశం ఉంటుంది. మిరప విత్తిన, నాటిన 20-25 రోజులకు మొదలు పెట్టి, అ తరువాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి చొవ్పున సాళ్ళ మధ్యన ఖాళీ కప్పుకునేంత వరకు అంతర సేద్యం చేయాలి.

Chilli Crop
Chilli Crop : తెలుగురాష్ట్రాల్లో సాగుచేయబడుతున్న ప్రధానమైన వాణిజ్య వంట మిరప. జూన్ చివరి వారం నుండి జులై నెలలో, నాటు తోటగా ఆగస్టు రెండవ పక్షం నుండి సెప్టెంబరు రెండవ వక్షం వరకు మిరప సాగు మొదలు పెట్టటానికి అనుకూలమైన నమయం. మిరవ మొక్కలు పెరిగిపెద్దవై కొమ్మలతో సాళ్ళ మధ్య దూరం కమ్ముకోవటానికి 80 నుండి100 రోజుల వరకు నమయం తీసుకుంటుంది. ఈ సమయం అంతా కూడ వర్షాలు అధికంగా ఉండే జులై ఆగస్టు, సెప్టెంబరు నెలలు కావటంతో కలుపు ఎక్కువగా ఆశించటానికి అవకాశం ఉంటుంది. మిరప దీర్ఘకాలిక పంట కావటం వలన, రైతులు ప్రతి 25-30 రోజులకు నీరుకట్టి ఎరువులు వేస్తారు. ఎరువులు, నీటి వినియోగం ఎక్కువ కాబట్టి ఈ పంటలో కలువు రావటానికి కూడ అవకాశాలు ఎక్కువ. కలువు వలన మిరపకు నష్టం కలుగకుండా ఉండేందుకుగాను రైతులు వివిధ కలుపు యాజమాన్య పద్ధతులతో సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టాలి.
READ ALSO : Chilli Cultivation : మిరపలో అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం
ముందుగా నేలతయారి :
ఏప్రిల్ – మే నెలలలో కురిసే వర్షాలకు ట్రాక్టరు నాగలితో 8-10 అంగుళాల లోతువరకు దుక్కి చేసుకోవాలి. ఆ తరువాత తొలకరి వర్షాలకు 4 సార్లు గొర్రు, గుంటకలతో నేల బాగా తయారు చేసుకుంటే మిరప పైరులో కలుపు రాకుండ చాలా వరకు నివారించుకోవచ్చు.
అంతర సేద్యం :
మిరప సాళ్ళ మధ్య, సాళ్ళలో మొక్కల మధ్య దూరం అధికం కాబట్టి గొర్రు, గుంటకలతో సేద్యం చేయటానికి అవకాశం ఉంటుంది. మిరప విత్తిన, నాటిన 20-25 రోజులకు మొదలు పెట్టి, అ తరువాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి చొవ్పున సాళ్ళ మధ్యన ఖాళీ కప్పుకునేంత వరకు అంతర సేద్యం చేయాలి. నాటువేసిన తోటలలో సాళ్ళ మధ్యన, మొక్కల మధ్యన దూరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అంతర సేద్యం రెండువైపుల చేయవచ్చు. అంతర సేద్యం చేసిన తరువాత పొలంలో మిగిలిపోయిన కలుపు మొక్కలు కూలీలతో తీయించాలి.
READ ALSO : Hybrid Chili Varieties : మిరపలో హైబ్రిడ్ లకు దీటుగా సూటిరకాలు.. అధిక దిగుబడులిస్తున్నలాంఫాం రకాలు
కలుపు మందుల వినియోగం :
సాలు తోటలలో పెండిమిథాలిన్ ౩0 శాతం ఎకరానికి 1.00- 1.25 లీటర్లు 200 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే పిచికారి చేయాలి. విత్తిన వెంటనే పిచికారి చేయలేని పరిస్థితులలో విత్తిన 48 గంటలలోపు పిచికారి చేయలి. మిరప నారు నాటుకునే పొలంలో, మొక్కలు నాటేముందు నేల పైన పెండిమిథాలిన్ పిచికారి చేసి, అ తరువాత మొక్కలు నాటాలి.
మిరప పైరు పెరిగే దశలో గడ్డిజాతికి చెందిన కలుపు నివారణకు ఎకరానికి 250 మి.లీ. ఫెనాక్సాప్రావ్ 9% (లేకు 400 మి.లీ. క్విజాలోఫాప్ 5% (లేక) 250 మి.లీ. ప్రొపాక్విజాఫాప్ 10 శాతం 200 లీటర్లు నీటిలో కలిపి విచికారి చెయ్యాలి. ఈ మందులు వాడినపుడు మిరప పైరు 4-5 రోజులు కొంచెం పసుపు రంగుకు
మారి ఎదుగుదల తగ్గుతుంది. 7-10 రోజులకు సాధారణ స్థితికి వస్తుంది. కాబట్టి వర్షాలు ముసురుగా కురుస్తూ అంతర సేద్యానికి అవకాశం లేనపుడు మాత్రమే ఈ మందులు వాడాలి.
READ ALSO : Chilli Cultivation : మిరప నార్లు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం పాటించాల్సిన యాజమాన్యం
మిరవ పెరిగే దశలో ఆశించే వెడల్పాకు కలుపు మొక్కల నివారణకు విచికారి చేసే కలుపు మందులు అందుబాటులో లేవు. మిరపలో విడతలుగా నీరు కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి, నీరు కట్టిన ప్రతీసారి కూడా కలుపు మొలిచే అవకాశంఉంటుంది. పైరులో సాళ్ళుకమ్ముకున్న తరువాత కలుపు వలన పెద్దగా సమస్య లేనప్పటికిని, పాయలాకువంటి కలుపు ఆశించినపుడు పైరు నీడలోకూడ పెరుగుతూ నష్టం కలుగజేన్తుంది. అటువంటి పరిస్థితులలో బాగా పెరిగిన మిరప పైరులో వర్షానికి,) నీరుకట్టి నేల బాగా తడిగా ఉన్నపుడు అక్సిఫ్లూరో ఫెన్ 23.59 ఎకరానికి 200 మి.లీ. కలుపు మందు 10 కిలోలు ఇసుకలో కలువుకుని మిరప మొక్కల పైన పడకుండ సాళ్ళమధ్యలో నేలమీద పడేటట్లు చల్లినపుడు పాయలాకు కలుపును నివారించవచ్చు. ఈ మందు మిరప మొక్కలమీద పడితే ఆకులు మాడిపోయే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తతో వాడాలి. .