పాతరకాలకు ప్రత్యామ్నాయంగా కొత్త రకాలు.. దొడ్డుగింజ వరి రకాలు

వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు.

పాతరకాలకు ప్రత్యామ్నాయంగా కొత్త రకాలు.. దొడ్డుగింజ వరి రకాలు

Paddy Cultivation: ఖరీఫ్ సమయం దగ్గర పడుతోంది. వరిసాగు చేసే రైతులు అందుకోసం సిద్ధమవుతున్నారు. అయితే రకాల ఎంపిక పట్ల రైతులు తగిన అవగాహనతో ముందడుగు వేయాలి. ముఖ్యంగా దొడ్డుగింజ రకాలను సాగుచేయాలనుకునే రైతులు పాత రకాల స్థానంలో అనేక కొత్తరకాలు అందుబాటులోకి వచ్చాయి.. అయితే వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..

వరి సాగుచేసే ప్రాంతాల్లో ఆయా కాలమాన పరిస్థితులు, వాతావరణం, భూములను బట్టి శాస్త్రవేత్తలు ప్రాంతాల వారీగా అనేక వరి వంగడాలను రూపొందించారు. అయితే ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న పాత రకాలను సాగుచేస్తున్నారు రైతులు. వాటికి ప్రత్యామ్నాయంగా అపేక రకాలు మార్కెట్ లోకి వచ్చాయి. అయితే రకాల పట్ల రైతులకు పూర్తి అవగాహన ఉండాలి.

Also Read: ఖరీఫ్‌కు అనువైన దీర్ఘకాలిక సన్నవరి రకాలు.. అధిక దిగుబడులంటున్న శాస్త్రవేత్తలు

రానున్న ఖరీఫ్ కాలానికి ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి.. ఏ రకాన్ని ఎన్నుకుంటే మంచి దిగుబడులు పొందవచ్చో తెలిసి ఉండాలి. ఖరీఫ్ లో దొడ్డుగింజ రకాలను సాగుచేయాలనుకునే రైతులకు అందుబాటులో ఉన్న నూతన రకాలేంటివి.. వాటి గుణగణాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త సి.హెచ్. దామోదర్ రాజు ద్వారా తెలుసుకుందాం.